Sunday, November 17, 2024

ఎపిలో కొత్తగా 993 పాజిటీవ్ కేసులు

- Advertisement -
- Advertisement -

993 New Corona Cases Reported in AP

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ సెకెండ్ వేవ్ విజృంభిస్తుంది. దీంతో గత మూడు నాలుగు రోజులుగా ఎపిలో దాదాపు వెయ్యి చొప్పున పాజిటీవ్ కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24గంటల్లో ఎపిలో కొత్తగా 993 మందికి కరోనా నిర్దారణ అయ్యినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇక, కరోనా వైరస్ బారిన పడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ముగ్గురు ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపింది. ఎపిలో అత్యధికంగా చిత్తూరులో 179, గుంటూరులో 198 కేసులు నమోదవుతున్నాయని పేర్కొంది. దీంతో ఎపిలో మొత్తం కరోనా పాజిటీవ్ కేసులు 9 లక్షలు దాటాయి. ఇప్పటివరకు కరోనాతో రాష్ట్రవ్యాప్తంగా 7,213 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం రాష్ట్రంలో 6,614 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు ఎపిలో 8.86 లక్షల మందికి పైగా బాధితులు వైరస్ నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.

993 New Corona Cases Reported in AP

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News