Monday, January 20, 2025

టీచర్ చేసిన పనికి అవమానంతో విద్యార్థిని ఆత్మహత్యాయత్నం

- Advertisement -
- Advertisement -

రాంచీ: క్లాస్‌లో యూనిఫారమ్‌ను బలవంతంగా టీచర్ విప్పించిందన్న అవమానంతో 9వ తరగతి బాలిక నిప్పంటించుకుని ఆత్మహత్యకు యత్నించింది. ఝార్ఖండ్ లోని జంషెడ్‌పూర్‌లో ఈ సంఘటన జరిగింది. పరీక్షలు రాస్తున్న ఈ విద్యార్థి వద్ద కాపీ చీటీలు ఉన్నట్టు మహిలా ఇన్విజిలేటర్ అనుమానించి పక్కన ఉన్న మరో క్లాస్ రూమ్ లోకి తీసుకెళ్లి బలవంతంగా స్కూల్ యూనిఫారమ్‌ను విప్పించి తనిఖీ చేసింది. ఈ సంఘటనను అవమానంగా బాలిక భావించింది. పరీక్ష అయిన తరువాత ఇంటికెళ్లి ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యకు ప్రయత్నించింది. బాలిక తల్లి, స్థానికులు వెంటనే ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పారు. బాలిక తల్లి ఫిర్యాదుతో టీచర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. విద్యార్థిని వాంగ్మూలాన్ని రికార్డు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ సంఘటనను వ్యతిరేకిస్తూ స్థానికులు నిరసనకు దిగారు. సంబంధిత టీచర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

9th Student Attempt Suicide in Jamshedpur

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News