- Advertisement -
హైదరాబాద్ : జిల్లా వెనకబడిన తరగతుల అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కళాశాల్లో ఇంటర్, డిగ్రీ, ఇంజనీరింగ్ చేసే విద్యార్దులు ఉపకార వేతనాలకు దరఖాస్తులు చేసుకునేందుకు ఈనెల 15వ తేదీవరకు గడువు పొడిగించినట్లు జిల్లా బిసి సంక్షేమ శాఖ అధికారులు పేర్కొన్నారు. శనివారం వారు ఒక ప్రకటనలో పేర్కొంటూ అర్హులైన విద్యార్దులు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఆయా కళాశాల యాజమాన్యాలు కూడా చొరవ తీసుకుని విద్యార్దులంతా నమోదు చేసుకునేల చూడాలని సూచించారు.
Date Extension for scholarship application
- Advertisement -