- Advertisement -
కోలీవుడ్ యంగ్ హీరో శివ కార్తికేయన్ నటిస్తున్న తాజా చిత్రాన్ని ‘శక్తి’ టైటిల్ తో తెలుగులో విడుదల చేయనున్నారు. ఈ చిత్రంలో శివ కార్తికేయన్ కు జోడీగా యంగ్ బ్యూటీ కళ్యాణీ ప్రియదర్శినీ కథానాయికగా నటిస్తోంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ను చిత్రయూనిట్ విడుదల చేసింది. ఈ ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. యాక్షన్, ఎమోషన్ డ్రామా నేపథ్యంతో డైరెక్టర్ పిఎస్ మిత్రన్ ఈ మూవీని తెరకెక్కిస్తున్నాడు. ఈ మూవీలో యాక్షన్ కింగ్ అర్జున్ ముఖ్యపాత్ర పోషిస్తున్నాడు. యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్న ఈ సినిమాను మార్చి 20న గ్రాండ్ గా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు చిత్రయూనిట్.
Shiva Karthikeyan’s Shakthi Movie Trailer Released
- Advertisement -