Saturday, September 21, 2024

కరోనా ఎఫెక్ట్… కళ తప్పిన హోలీ

- Advertisement -
- Advertisement -

Corona Virus

 

హైదరాబాద్ : హోలీ అనేది రంగుల పండుగ. వసంత కాలంలో వచ్చే ఈ పండగను మనదేశంలో ప్రజలు ఘనంగా జరుపుకుంటారు. హోలీ పండుగకు ముందు రోజు నగర ప్రజలు ఆయా ప్రాంతాల కూడళ్ల వద్ద కామదహనం చేసి తెల్లవారి ఉదయం నుంచి కుల మత బేధాలు లేకుండా అందరూ ఆనందోత్సాహాల మధ్య జరుపుకుంటారు. ముఖ్యంగా గ్రేటర్ నగరంలో దేశంలోని అన్నిరాష్ట్రాలకు చెందిన ప్రజలు నివసిస్తుండటంతో ఈపండుగకు ఎంతో ప్రాధాన్యత ఉందని పేర్కొనవచ్చు. అలాంటి పండగ ఈ ఏడాది కల తప్పి నగరం బోయిపోయినట్లు కనిపించింది. ఒక రోజు ముందు నుంచే యువతీ, యువకులు హోలీ రంగులు చల్లుకుంటూ రోడ్లపై కేరింతలు కొడుతున్నారు. ఈసారి కరోనా వైరస్ దెబ్బతో హోలీకి దూరంగా ఉన్నారు. జన సమూహాలు ఉన్నచోట వైరస్ త్వరగా సోకుతుందని వైద్యులు హెచ్చరించడంతో ప్రజలు చేతిలో రంగులు పట్టుకోవాలంటే భయపడిపోయారు.

కరోనా వైరస్ చైనా దేశం నుంచే రావడంతో, చాలా రకాల రంగుల అక్కడి నుంచి రావడంతో వైరస్ ప్రభావం చూపుతుందని అనుమానం వ్యక్తం చేశారు. గత పదిరోజుల మహానగరం కరోనా వైరస్ గుప్పిట్లో విలవిలలాడింది. దుబాయ్‌నుంచి హైదరాబాద్‌కు వచ్చిన మహేంద్రహిల్స్‌కు చెందిన సాప్ట్‌వేర్ ఇంజనీర్‌కు సోకినట్లు గుర్తించి వెంటనే ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. వెంటనే అతని వెంట బస్సులో ప్రయాణం చేసిన సహచరులతో పాటు, బంధువులతో సహా 88మందికి మరుసటి రోజు గాంధీ ఆసుపత్రిలో కరోనా పరీక్షలు చేశారు. ఇప్పటివరకు 650 మందికి కరోనా టెస్టులు చేసినట్లు వైద్యశాఖ ప్రకటించింది. వైద్యులు సూచించిన సలహాలు పాటించి వైరస్ బారిన పడకుండా ఉండాలని హెచ్చరించారు. దీంతో ప్రజలు ఇంటినుంచి బయటకు వెళ్లాంటే మాస్కులు ధరించి విధులకు హాజరైతున్నారు.

కరోనా వైరస్ అరికట్టేందుకు చాలామంది ప్రముఖులు హోలీ సంబరాలకు దూరంగా ఉంటామని ప్రకటించారు. ప్రధాని మోడీ, అమిత్‌షా లాంటి రాజకీయ నేతలు హోలీ వేడుకల్లో పాల్గొనమని పేర్కొనడంతో చాలామంది యువతీ, యువకులు ఇంటికి పరిమితమయ్యారు. దీంతో నిత్యం రద్దీగా కనిపించే రోడ్లు నిర్మానుష్యంగా కనిపించాయి. నగరంలో ఉత్తరాధి రాష్ట్రాలకు చెందిన ప్రజలు గోషామహల్, సుల్తాన్‌బజార్, కాచిగూడ, నారాయణగూడ, అబిడ్స్, చత్రినాక, గౌలిగూడ, కుల్సంపురా, నాంపల్లి, మెహిదిపట్నం, యూసుప్‌గూడ, శ్రీనగర్‌కాలనీ, మూసపేట, సికింద్రాబాద్, మారేడుపల్లి వంటి ప్రాంతాల్లో పెద్ద వ్యాపారులు స్దిర పడ్డారు. వీరంతా ఘనంగా వేడుకలు నిర్వహిస్తారు. ఈసారి కరోనా దెబ్బకు హోలీ అడేందుకు వెనకడుగు వేశారు. వైరస్ సోకుతుందని ఇతరులకు సూచనలిస్తూ రంగులు పూసుకోవద్దన్నారు.

గిరాకీలు లేక రంగుల వ్యాపారుల ఆందోళన ః ప్రతి ఏటా నగరంలో హోలీ సందర్భంగా  రంగుల వ్యాపారం రూ. 60 నుంచి రూ.80కోట్లవరకు వ్యాపారం నడిచేదని గోషామహల్‌కు చెందిన వ్యాపారి రాంసింగ్ పేర్కొంటున్నారు. మూడు నెలల ముందుగానే ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుని పెద్ద ఎత్తున అమ్మకాలు చేస్తామని, ఈసంవత్సరంలో కరోనాతో హోలీ పండగకు వ్యాపారం సాగలేదని ఆవేదనవ్యక్తం చేశారు. వైరస్ ప్రభావంతో తాము చాలా నష్టపోయామని వెల్లడించారు.

Corona Virus Effect on Holly
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News