Saturday, September 21, 2024

అలా జరిగితే కరోనా విజృంభించే ప్రమాదం ఉంది: మోడీ

- Advertisement -
- Advertisement -

 

న్యూఢిల్లీ: కరోనా వైరస్(కోవిడ్-19) వ్యాప్తి నియంత్రణపై, లాక్ డౌన్ అమలుపై అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వీడియో కన్ఫరెన్స్ నిర్వహించారు. మర్కజ్ వెళ్లొచ్చిన వారి నుంచి వైరస్ వ్యాప్తి జరగకుండా తీసుకున్న చర్యలను సిఎంలు ప్రధానికి వివరించారు. ఎన్ జివోలు, సంక్షేమ సంస్థలు, సామాజిక నేతల సహకారం తీసుకోవాలని సిఎంలకు ప్రధాని మోడీ సూచించారు. ”లాక్ డౌన్ ముగిసిన తర్వాత ప్రజలంతా మూకుమ్మడిగా బయటకు వచ్చే అవకాశం ఉంది. జనమంతా ఒకే సారి బయటకు వస్తే కరోనా విజృంభించే ప్రమాదం ఉంది. ఒక్క ప్రాణం కూడా పోకుండా కాపాడుకోవడం మనందరి భాద్యత. కరోనా వ్యప్తి నివారణలో అన్ని రాష్ట్రాలు ఒక్కటై కృషి చేయడం ప్రశంసనీయం. లాక్ డౌన్ తర్వాత రాష్ట్రాలు, కేంద్రం పరిష్కార వ్యూహం రూపొందించుకోవాలి” అని మోడీ చెప్పారు. కరోనా నియంత్రణలో సహకరిస్తున్న అందరికి ఈ సందర్భంగా మోడీ ధన్యవాదాలు తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో సిఎం కెసిఆర్ కూడా పాల్గొన్నారు.

PM Modi Video Conference with All States CM’s

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News