Saturday, September 21, 2024

పొడిగింపు తేలేదీ నేడే

- Advertisement -
- Advertisement -

CM KCR

 

దేశమంతటా ఉత్కంఠ, నేడు రాష్ట్రాల సిఎంలతో ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్
ఆ తర్వాత జాతినుద్దేశించి ప్రధాని
కీలక ప్రసంగం చేసే అవకాశం

నేడు రాష్ట్ర కేబినెట్ భేటీ

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర కేబినెట్ సమావేశం సిఎం కెసిఆర్ అధ్యక్షతన శనివా రం మధ్యాహ్నం 3 గంటలకు ప్రగతి భవన్‌లో జరగనుంది. ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి, దాని వల్ల ఉత్పన్నమైన పరిస్థితులు, భవిష్యత్ కార్యాచరణ తదితర అంశాలపై చర్చిస్తారు. రాష్ట్రంలో కరోనా పాజిటవ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో లాక్‌డౌన్‌ను మరికొన్ని రోజులు పొడగించే అంశం పై లోతుగా సమీక్షించనున్నారు. ఈ సమావేశంలో ఎన్ని రో జులు పాటు లాక్‌డౌన్‌ను పొడగించాలన్న అంశంపై సిఎం కెసిఆర్ ఒక నిర్ణయం తీసుకోనున్నారు. కాగా లాక్‌డౌన్ కారణంగా రాష్ట్రంలోని పేదలు, ఇతర రాష్ట్రా ల నుంచి వలస వచ్చిన కార్మికులకు 12 కిలలో చొప్పున అందిస్తున్న బియ్యంతో పాటుగా తెల్లరేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబాలని రూ.1500 చొప్పున అందిస్తున్న నగదు సాయంపై కూడా సమీక్షిస్తారని తెలుస్తోంది.

ఇదిలా ఉండ గా లాక్‌డౌన్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై తీవ్ర ప్రభావం చూపింది. ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన ఆదాయం గణనీయంగా పడిపోయింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని సమీక్షించుకొని భవిష్యత్‌లో అనుసరించాల్సిన కార్యాచరణపై కూడా మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నారు. గత రెండు రోజులుగా రాష్ట్రంలో కురుస్తున్న వడగండ్ల వానలు, పంటనష్టం సహా రైతులకు అందించాల్సిన సాయం తదితర అంశాలపై కూడా మంత్రివర్గంలో విస్తృతంగా చర్చించి నిర్ణయాలు తీసుకొనే అవకాశముంది. అలా గే వరి ధాన్యంతో సహా ఇతర పంటల కొనుగోళ్లు, అందుకు సంబంధించిన ఏర్పాట్లు, పరిస్థితులపై కూడా సమావేశంలో చర్చిస్తారు. వరి ధాన్యానికి అవసరమైన గోనె సంచుల కొరత సహా ఇతర అంశాలపై కూడా సిఎం సమీక్షిస్తారు.

నేడు సిఎంలతో ప్రధాని వీడియోకాన్ఫరెన్స్
లాక్‌డౌన్ గడువు ముగింపు తేదీ సమీపిస్తున్న తరుణంలో ప్రధాని మోడీ మరోసారి జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా ఏప్రిల్ 14న లాక్‌డౌన్ ఎత్తివేసే విషయంపై కీలక ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. శనివారం ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన అనంతరం తన నిర్ణయాన్ని వెల్లడించనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ముఖ్యమంత్రుల అభిప్రాయాలు తీసుకోవడమే కాకుండా ఆయా రాష్ట్రాల్లో కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలను ప్రధాని అడిగి తెలుసుకోనున్నారు. కరో నా విజృంభిస్తున్న క్రమంలో మార్చి 24న విధించిన లాక్‌డౌన్ ఎత్తివేయడం సాధ్యం కాదని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితులు సామాజిక అత్యవసర స్థితిని తలపిస్తున్న తరుణంలో కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదని వ్యాఖ్యానించారు.

PM Modi video conference with CMs today
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News