Sunday, September 22, 2024

ఇల్లు ఊడ్చారు.. గిన్నెలు తోమారు!

- Advertisement -
- Advertisement -

ss rajamouli

 

కరోనా కారణంగా లాక్‌డౌన్ హాలిడేస్‌ను సెలబ్రిటీలు తమదైన శైలిలో ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా ‘అర్జున్‌రెడ్డి’ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఇల్లు ఊడ్చి, గిన్నెలు తోమి, గదులను శుభ్రపరిచి… ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అంతటితో ఆగలేదాయన. ఆ ఛాలెంజ్‌ని రాజమౌళికి విసిరారు. రాజమౌళి ఏం తక్కువా.. ‘బాహుబలి’ సినిమాతో ప్రపంచం దృష్టినే ఆకర్షించిన గొప్ప దర్శకుడాయన. అలాంటిది ఇంటి పని చక్కబెట్టలేరా..? చెప్పండి. అందుకే ఆ ఛాలెంజ్‌ని స్పోర్టివ్‌గా స్వీకరించారు.

ఆయన కూడా ఇళ్లు ఊడ్చడంతో పాటు , ఇంటి కిటికీ అద్దాలు క్లీన్ చేయడం, గిన్నెలు తోమడం తదితర పనుల ద్వారా ఛాలెంజ్ పూర్తి చేసేశారు. ఆయన కూడా అక్కడితో ఆగలేదండోయ్. రామ్‌చరణ్, ఎన్టీఆర్, కీరవాణి, ‘బాహుబలి’ నిర్మాత శోభు యార్లగడ్డలకు ఈ ఛాలెంజ్ విసిరారు. ఇప్పటికే చరణ్ వంట చేసిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇక ఇప్పుడు రాజమౌళి ఛాలెంజ్‌ని ఎలా స్వీకరిస్తారో చూడాలి మరి. మొత్తానికి కరోనా కాలం భలే పని చేసిందిలే. ఒకింత కష్టాన్నీ, మరింత వినోదాన్నీ పంచుతోంది. ఏదేమైనా ‘స్టే హోమ్, స్టే సేఫ్’ అనే నినాదాన్ని ప్రజలకు గట్టిగా వినిపించేందుకు సెలబ్రిటీలు చేస్తున్న ప్రచారంలో భాగమే ఇదంతా. తాము ఇంట్లోనే ఉంటూ ఈ ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కాలక్షేపం చేస్తూ ఉన్నంతలో తమ వంతుగా అభిమానులకు వినోదం పంచుతూ కరోనా కట్టడికి తోడ్పడుతున్నారు.

Celebrities doing household chores
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News