న్యూయార్క్: అమెరికా బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్ పేరు తెలియని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. అతను రింగ్‌లోకి దిగాదంటే ఎంతటి ప్రత్యర్థి అయినా టైసన్ పంచ్‌లకు తలొగ్గక తప్పదు. దశాబ్దాల పాటు ప్రపంచ బాక్సింగ్‌ను శాసించిన అమెరికా గ్రేట్ టైసన్ మళ్లీ బాక్సింగ్‌లోకి దిగాలని భావిస్తున్నాడు. మాజీ ప్రపంచ హెవీ వెయిట్ బాక్సింగ్ చాంపియన్ అయిన టైసన్ చాలా కాలం క్రితమే ఆటకు వీడ్కోలు పలికాడు. పలు వివాదాల్లో చిక్కుకోవడంతో టైసన్ కెరీర్ అర్ధాంతరంగా ముగిసింది. అయితే అతను మళ్లీ బాక్సింగ్ పోటీల్లో తలపడాలని భావిస్తున్నట్టు సమాచారమిచ్చాడు. ఈ మేరు ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశాడు. 53 ఏళ్ల టైసన్‌లో ఇంకా చాలా మిగిలేవుందని విశ్లేషకులు సయితం అభిప్రాయపడుతున్నారు. అతను చేస్తున్న కసరత్తును గమనిస్తే అతని పవర్ ఏ మాత్రం తగ్గలేదనిపిస్తోంది.
టైసన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన కసరత్తు వీడియోను చూస్తుంటే అతని మళ్లీ పూర్వ వైభవం సాధించడం ఖాయంగా కనిపిస్తోంది. నేను మళ్లీ రింగ్‌లోకి వస్తున్నా.. ప్రత్యర్థులకు ఇదే సవాల్ అంటూ టైసన్ ఆ వీడియోలో కామెంట్‌ను జత చేశాడు. ప్రస్తుతం టైసన్ పోస్ట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. టైసన్‌ను అభిమానించే కోట్లాది మంది అభిమానులకు ఇది శుభసూచకంగా చెప్పాలి. టైసన్ రింగ్‌లోకి బరిలోకి దిగక ముందే చాలా మంది ప్రత్యర్థులు చేతులెత్తేస్తారు. ఒకసారి అతను తన పంచ్‌లకు శ్రీకారం చుడితే సెకన్లలోనే ప్రత్యర్థులు చిత్తు కావడం అనవాయితీ. ఇదిలావుండగా ఓ స్వచ్ఛంద సంస్థకు నిధులు సేకరించేందుకు టైసన్ మళ్లీ బరిలోకి దిగుతున్నాడని కథనాలు వస్తున్నాయి. అయితే అతను చేస్తున్న కసరత్తును గమనిస్తే మాత్రం మళ్లీ సెకండ్ ప్రారంభించాలనే ఉద్దేశంతో ఉన్నట్టు స్పష్టమవుతోంది.