Friday, September 20, 2024

భారత్ స్వయం సమృద్ధి దేశంగా ఎదిగేందుకే ఆర్థిక ప్యాకేజీ: నిర్మలా సీతారామన్‌

- Advertisement -
- Advertisement -

 

న్యూఢిల్లీ: స్థానిక ఉత్పత్తులను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లాలనేదే మా ఉద్దేశమని, భారత్ స్వయం సమృద్ధి దేశంగా ఎదిగేందుకే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రూ. 20 లక్షల కోట్లతో ఆర్థిక ప్యాకేజీ ప్రకటించారని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ అన్నారు. మంగళవారం లాక్ డౌన్ నేపథ్యంలో తలెత్తిన సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ప్రధాని మోడీ ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీపై నిర్మలా సీతారామన్‌ మీడియా సమావేశంలో మాట్లాడుతూ వివరాలను వెల్లడించారు. ఐదు మూలసూత్రాల ఆధారంగా ప్యాకేజీ రూపొందించామన్నారు. గడిచిన 40 రోజుల్లో పిపిఈలు, మాస్కుల తయారీలో వృద్ధి సాధించామన్నారు. కొన్ని వారాల పాటు సమాజంలో వివిధ వర్గాలతో లోతుగా చర్చించి నిర్ణయం తీసుకున్నామన్నారు.

భారత్ స్వయం సమృద్ధిగా ఎదగడానికి ఈ ప్యాకేజీ ఉపయోగపడుతుందన్నారు. స్వదేశీ బ్రాండ్లను తయారుచేయడమే ఈ ప్యాకేజీ ఉద్దేశమని చెప్పారు. ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా పేదలకు మేలు జరిగిందని తెలిపారు. రూ.41 కోట్ల జన్ ధన్ ఖాతాల్లోకి రూ.52వేల కోట్లు బదిలీ చేశామన్నారు. దివ్యాంగులు, వృద్ధాప్య పెన్షన్ దారులకు అండగా నిలిచామన్నారు. రూ.14 లక్షల టాక్స్ పేయర్స్ లబ్ధి పొందారని, రూ.18 వేల కోట్ల విలువైన ఆహారధాన్యాలు పంపిణీ చేశామన్నారు. కోవిడ్ వారియర్స్ కు రూ.50 లక్షల ఇన్సూరెన్స్ అందించనున్నట్లు తెలిపారు. ఆర్థిక, మౌలిక, సాంకేతిక, దేశ జనాభా, డిమాండ్‌ సూత్రాలు ఆత్మ నిర్భర భారత్‌కు మూల స్తంభాలని చెప్పారు. సెక్టార్ల వారీగా ఆర్థిక ప్యాకేజీని ప్రకటిస్తామని పేర్కొన్నారు. గత 40 రోజులుగా ఇండియా శక్తేంటో ప్రపంచానికి తెలిసిందని నిర్మాలా సీతారామన్ అన్నారు.

Nirmala Sitaraman press meet on Economic Package

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News