Sunday, September 22, 2024

ముగింపు దశకు ధాన్యం కొనుగోళ్లు

- Advertisement -
- Advertisement -

Process of Grain Purchases has come to an end

 

86 శాతానికి చేరిన కొనుగోళ్లు
ఒకే రోజు రూ. 600 కోట్లు విడుదల
పౌరసరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి

మన తెలంగాణ/హైదరాబాద్ : యాసంగిలో ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి బుధవారం ఒక్కరోజే రూ. 600 కోట్లు విడుదల చేయడం జరిగిందని పౌరసరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఇప్పటివరకు 6392 కొనుగోలు కేంద్రాల ద్వారా 7.37 లక్షల మంది రైతుల నుంచి 55 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగిందని తెలిపారు. ఇందుకు సంబంధించి రూ. 6,433 కోట్లను రైతు ఖాతాలో జమ చేయడం జరిగిందని వెల్లడించారు. ప్రస్తుతం యాసంగి కొనుగోళ్ల ప్రక్రియ ముగింపు దశకు చేరుకుందని, దాదాపు 86 శాతం కొనుగోళ్లు పూర్తయ్యాయని ఒక పత్రికా ప్రకటనలో మారెడ్డి తెలిపారు. 6392 కొనుగోలు కేంద్రాలకు గాను 2505 కేంద్రాల్లో కొనుగోళ్లు పూర్తి కావడంతో వాటిని మూసివేయడం జరిగిందన్నారు. కరీంనగర్, కామారెడ్డి, నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో 99 శాతం, నిజామాబాద్, మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట్, మహబూబ్ నగర్, మహబూబాబాద్, వరంగల్ అర్బన్, సూర్యాపేట, మేడ్చల్ జిల్లాల్లో దాదాపు 90 శాతానికి పైగా కొనుగోళ్లు పూర్తయ్యాయని మారెడ్డి తెలిపారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యన్ని త్వరితగతిన రైస్ మిల్లులకు తరలించాలని, కొనుగోళ్ల ప్రక్రియ పూర్తికావస్తున్న నేపథ్యంలో కస్టం మిల్లింగ్ రైస్ (సిఎంఆర్) మీద దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News