Friday, September 20, 2024

కీలక నిర్ణయం తీసుకున్న నిత్య

- Advertisement -
- Advertisement -

Nithya Menen is geared towards directing

 

ప్రతిభావంతమైన కథానాయికల్లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్న భామ నిత్యామీనన్. కథానాయికలంతా గ్లామర్ పాత్రల వైపు మొగ్గు చూపిస్తుంటే… నిత్య మాత్రం నటనకు ప్రాధాన్యమైన చిత్రాలను ఎంచుకుంటోంది. తాజాగా నిత్యామీనన్ తన కెరీర్‌లో ఓ కీలకమైన నిర్ణయం తీసుకుందని తెలిసింది. నటనను పక్కన పెట్టి ఆమె దర్శకత్వం వైపు దృష్టి సారించిందట. ఈ లాక్‌డౌన్ సమయంలో ఆమె కొన్ని కథలను సిద్ధం చేసుకుందని తెలిసింది. వాటిని తన దర్శకత్వంలోనే తెరకెక్కించాలని నిర్ణయించుకుందట. అయితే ఈ సినిమాల్లో తాను కథానాయికగా నటించదట. ఇతర హీరోయిన్లకు అవకాశం ఇస్తుందట. ఇక త్వరలోనే నిత్య దర్శకత్వంలో తెలుగు, తమిళ్, మలయాళ భాషల్లో ఓ సినిమా పట్టాలెక్కే అవకాశం ఉందని సమాచారం. మరి ఈ కొత్త పాత్రలో ఆమె ఏ మేరకు రాణిస్తుందో చూడాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News