Sunday, September 22, 2024

భారత్-చైనా సరిహద్దు పరిస్థితులు ఆందోళన కలిగిస్తోంది: బ్రిటన్ ప్రధాని

- Advertisement -
- Advertisement -

లండన్: భారత్-‌చైనా దేశాల సరిహద్దు తూర్పు లడఖ్ ప్రాంతంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారి ఆందోళన కలిగిస్తోందని, ఈ సమస్యను ఉభయ దేశాలు చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ సూచించారు. బుధవారం హౌస్ ఆఫ్ కామన్స్‌లో కన్సర్వేటివ్ పార్టీ ఎంపి ఫ్లిక్ డ్రుమాండ్ అడిగిన ప్రశ్నకు జాన్సన్ సమాధానం ఇచ్చారు. ఒకవైపు కామన్వెల్తు సభ్యురాలైన పెద్ద ప్రజాస్వామ్య దేశం, మరోవైపు మన ప్రజాస్వామ్యాన్ని సవాలు చేసే అగ్రరాజ్యం మధ్య వివాదం చెలరేగడం ఆందోళన కలిగిస్తోందని జాన్సన్ అన్నారు. ఈ పరిస్థితిని బ్రిటన్ చాలా నిశితంగా పర్యవేక్షిస్తోందని చెప్పారు. సరిహద్దు సమస్యను రెండు దేశాలు చర్చల ద్వారా సామరస్యంగా పరిష్కరించుకోవడం ఒక్కటే ఇప్పుడు ఉత్తమ మార్గమని, దీనికి తాము ప్రోత్సహిస్తామని ఆయన అన్నారు.

India-China Standoff Very Serious Worrying: UK PM

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News