Saturday, September 21, 2024

దేశంలో 9లక్షలు దాటిన కరోనా కేసులు

- Advertisement -
- Advertisement -

CoronavirusIndia COVID 19 cases tally crosses 9 lakh mark

న్యూఢిల్లీ: దేశంలో కరోనా పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. భారత్ లో కరోనా కేసులు 9 లక్షలు దాటాయి. దేశంలో గత 24 గంటల్లో 28,498 కొత్త కోవిడ్-19 కేసులు, 553 మరణాలు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. దీంతో మొత్తం కేసులు సంఖ్య 9,06,752కి చేరుకున్నాయి. వీటిలో 3,11,565 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటివరకు 5,71,460 నయమై కోలుకున్నారు. దేశవ్యాప్తంగా 23,727 బాధితులు కరోనాతో చనిపోయారని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. తెలుగురాష్ట్రాల్లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. తెలంగాణలో 36,221మందికి కరోనా వైరస్ సోకగా.. 365 మంది కోవిడ్ తో మరణించారు.

ఎపిలో మొత్తం కరోనా కేసులు 31,103కి చేరుకోగా…365 మరణాలు నమోదయ్యాయి. అటు మహారాష్ట్రలో కరోనా కేసులు 2,60,924కి చేరాయి. ఇప్పటివరకు 10,482 మంది కరోనాతో మృతి చెందారు. తమిళనాడులో కరోనా కేసులు 1,42,798కి పెరిగాయి. 2032 మంది ఇప్పటివరకు ఈ వైరస్ తో ప్రాణాలు కోల్పోయారు. ఢిల్లీలో 1,12,494 మందికి కరోనా బారిన పడగా… 3,371మందిని కరోనా కబలించింది. గుజరాత్ లో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఇప్పటివరకు 42,808 మందికి కోవిడ్ సోకగా… 2,057 మంది ఈ మహమ్మారితో మృతి చెందారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు వేగంగా విస్తరిస్తున్నాయి.

India COVID 19 cases tally crosses 9 lakh mark

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News