Friday, September 20, 2024

#PSPK28 కాన్సెప్ట్ పోస్టర్.. ‘ఈసారి కేవలం వినోదం మాత్రమే కాదు..’

- Advertisement -
- Advertisement -

#PSPK28 Concept Poster released

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా వస్తున్న సర్ ప్రైజ్ లతో అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. పవన్ నటించనున్న తాజా చిత్రాలకు సంబంధించిన పోస్టర్లను ఆయా నిర్మాణ సంస్థలు ఒక్కొక్కటిగా విడుదల చేశాయి. దీంతో గత రెండు సంవత్సరాలుగా పవన్ సినిమా కోసం ఎదురు చూస్తున్న అభిమానుల ఆనందం అంతా ఇంత కాదనే చెప్పాలి.  పవన్ వకీల్ సాబ్ తోపాటు మరో మూడు చిత్రాలను లైన్ లో పెట్టాడు. బుధవారం పవన్ పుట్టిన రోజు పురస్కరించుకొని ఈ మూవీస్ కు సంబంధించిన అప్డేట్స్ ను నిర్మాతలు ట్వీట్టర్ ద్వారా ప్రకటించారు.

తాజాగా పవన్ కళ్యాణ్- హరీశ్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కనున్న మూవీకి సంబంధించిన కాన్సెప్ట్ పోస్టర్ ను చిత్రయూనిట్ విడుదల చేశారు. ఈ పోస్టర్ అభిమానులను బాగా ఆకట్టుకుంటోంది. ఇందులో ఇండియా గేట్ వద్ద హార్లీ డేవిడ్ సన్ బైక్ పై పెద్ద బాలశిక్ష పుస్తకం, గులాబీ పువ్వు ఉండగా.. PSPK28 టైటిల్ లో సర్దార్ వల్లాభాయ్ పటేల్, సుభాష్ చంద్రబోస్ చిత్రాలు కనిపిస్తున్నాయి. దీనికి ఈ సారి కేవలం వినోదం మాత్రమే కాదు అనే క్యాప్షన్ పెట్టారు. ఈ క్రేజీ చిత్రాన్ని మైత్రీమూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తుంది. ఈ సినిమాకు రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నారు. ఇక, ఈ మూవీలో పవన్ సరసన అందాల భామ పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్నట్లు తెలుస్తోంది.

#PSPK28 Concept Poster released

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News