Saturday, September 21, 2024

కాన్పు కోసం వస్తే కాటికి పంపారు

- Advertisement -
- Advertisement -

pregnant woman dies in private hospital

హైదరాబాద్: గ్రేటర్ నగరంలో కార్పొరేట్ ఆసుపత్రుల అరాచకాలు రోజుకు శృతిమించిపోతున్నాయి. కరోనా రోగులు వైద్యకోసం వస్తే లక్షల రూపాయలు బిల్లువేసి దోపిడీకి తెగబడుతూ చివరకు కుటుంబ సభ్యులకు మృతదేహాలు అప్పగిస్తూ తమ వక్రబుద్ధి చాటుతున్నాయి. ప్రైవేటు ఆసుపత్రుల అధిక బిల్లులపై ఇప్పటికే ప్రజల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు రాగా, చివరకు న్యాయస్థానాలు జోక్యం చేసుకుని రోగుల చికిత్సకు ఇష్టానుసారంగా బిల్లుల వేసే ఆసుపత్రులపై చర్యలు తీసుకోవాలని వైద్యశాఖకు సూచించింది. దీంతో నగరంలో రెండు కార్పొరేట్ ఆసుపత్రులను వైద్యాధికారులు కరోనా చికిత్సకు వైద్యం చేయకుండా అనుమతులు రద్దు చేశారు. అయిన కార్పొరేట్ ఆసుపత్రులు యాజమాన్యాలు తమకేమి పట్టనట్లుగా నటిస్తూ జేబులు నింపుకునే పనిలో పడ్డారు. తాజాగా నగరానికి చెందిన ఓ కార్పొరేట్ ఆసుపత్రి కాన్పు కోసం వచ్చిన మహిళ బలితీసుకుని ఏకంగా లక్షలాది రూపాయలు చెల్లించుకుని చివరకు మృతదేహాన్ని చూపించింది.

మహబూబ్‌నగర్ జిల్లా గండీడ్ మండలం బల్సురుగొండకు చెందిన మాధవరెడ్డి భార్య శ్వేతారెడ్డి ఇటీవలే గ్రూపు2లో ఏసీటివోగా ఎంపికై నగరంలో విధులు నిర్వహిస్తుంది. నిండు గర్భణి అయిన ఆమెకు జూలై 7న జ్వరం రావడంతో స్థానికంగా ఉండే మహబూబ్‌నగర్‌లో ఓ ఆసుపత్రిలో చేర్చారు. దగ్గు రావడంతో కొవిడ్ టెస్టు చేస్తే నెగిటివ్ వచ్చింది. కాన్పు కోసం నగరంలోని ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో తీసుకెళ్లితే అక్కడ చికిత్స కోసం రూ. 2లక్షలు చెల్లిస్తే చేర్చుకుంటామని చెప్పడంతో చెల్లించారు. మగ బిడ్డకు జన్మనిచ్చింది. తరువాత ఆమెకు ఆయాసంగా ఉండటంతో కరోనా పరీక్షలు చేయాలని రక్తనమూనాలు సేకరించి ఫలితం సక్రమంగా చెప్పకుండా పాజిటివ్ వచ్చిందనడంతో, దీంతో కుటుంబసభ్యులు వైద్యం చేయాలని కోరడంతో ఐసీయూకు తరలించారు.

ఏరోజుకు ఆ రోజుకు బిల్లులు తీసుకుంటూ, 20 రోజలు పాటు ఉంచారు. ఆమె ఆరోగ్యంపై భర్తకు అనుమానం రావడంతో భార్యను చూపించాలని పేర్కొనడంతో అతనికి ఐసియూలోకి పంపించారు. అక్కడ ఆమె కళ్లతో చూడటం తప్ప గుర్తించే పరిస్థ్దితిలో లేదు. వారు వెంటనే ఇతర వైద్యులను సంప్రదిస్తామని చెప్పడంతో చివరకు గురువారం మృతి చెందినట్లు ఆసుపత్రి నిర్వాహకులు వెల్లడించారు. దీంతో భర్త ఆగ్రహం చెందిన జిల్లా వైద్యాధికారికి ఫిర్యాదు చేశారు. తమకు ఎలాంటి ముప్పు వస్తుందోనని యాజమాన్యం కాళ్ల బేరానికి దిగి రూ.4లక్షలు తిరిగి ఇస్తామని రాజకీయ బెదిరింపులకు దిగుతుందని ఆరోపించారు. మరోవైపు రెడ్డి జేఏసీ నాయకులు కార్పొరేట్ ఆసుపత్రులపై కఠిన చర్యలు తీసుకోవాలని కార్పొరేట్ ఆసుపత్రిపై చర్యలు తీసుకుని ప్రజలను దోచుకోకుండా కాపాడాలని కోరుతున్నారు.

pregnant woman dies in private hospital

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News