Thursday, September 19, 2024

మసీదులో ఎసిలు పేలిపోయి 12 మంది మృతి

- Advertisement -
- Advertisement -

12 Killed Dozens Injured In Explosion At Bangladesh

ఢాకా: బంగ్లాదేశ్ రాజధాని ఢాకా శివార్లలోని ఒక మసీదులో గ్యాస్ లీక్ కారణంగా ఒకేసారి ఆరుగురు ఎయిర్ కండీషనర్లు పేలిపోయి 12 మంది మరణించగా మరో 25 మంది గాయపడ్డారు. శుక్రవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో బైతుల్ సలాత్ మసీదులో ప్రార్థనలు జరుగుతుండగా ఈ పేలుళ్లు సంభవించినట్లు పత్రికా వార్తలు. ఈ పేలుడులో 25 మందికి కాలిన గాయాలు అయినట్లు తెలిసింది.

ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం 11 మంది మరణించగా ఒక మైనర్ బాలుడు శుక్రవారం రాత్రి మరణించినట్లు ప్రభుత్వ ఢాకా మెడికల్ కళాశాల ఆసుపత్రి చీఫ్ డాక్టర్ సమంతాలాల్ సేన్ తెలిపారు. శరీరాలు కాలిపోవడంతో 25 మందికి చికిత్స అందచేస్తున్నట్లు ఆయన చెప్పారు. 90 శాతానికి పైగా వారి శరీరాలు కాలిపోయినట్లు ఆయన తెలిపారు. ప్రధాని షేక్ హసీనా నేటి ఉదయం తనకు ఫోన్ చేసి క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితిపై వాకబు చేసినట్లు ఆయన తెలిపారు. మసీదు కింద నుంచి టైటాస్ గ్యాస్ పైపులైను ఉందని, లీకైన గ్యాసు పైపులైనులో ఉండిపోయి పేలుడుకు దారితీసి ఉంటుందని అనుమానిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

12 Killed Dozens Injured In Explosion At Bangladesh

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News