Friday, September 20, 2024

మాదాపూర్ లో కారు బీభత్సం

- Advertisement -
- Advertisement -

One Dead One Injured in Road Accident At Madhapur

హైదరాబాద్: నగరంలోని మాదాపూర్ లో ఆదివారం మధ్యాహ్నం కారు బీభత్సం సృష్టించింది. రోడ్డు దాటుతున్న ఇద్దరిపైకి కారు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుని పరిస్థితి విషమంగా ఉండడంతో చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. కారు నడుపుతున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కారు జూబ్లీహిల్స్ నుంచి అతివేగంగా వస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.

One Dead One Injured in Road Accident At Madhapur

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News