Thursday, September 19, 2024

ఒబామా రికార్డ్ బ్రేక్.. అధ్యక్ష పీఠానికి చేరువలో బైడెన్

- Advertisement -
- Advertisement -

US Election 2020: Joe Biden breaks Obama's Record

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల్లో డెమొక్రాట్‌ అభ్యర్థి జో బైడెన్‌, మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా రికార్డ్‌ను బద్దలుకొట్టాడు. ప్రస్తుత అధ్యక్ష ఎన్నికల ఫలితాల్లో 7 కోట్లకుపైగా ఓట్లు సాధించి జో బైడెన్‌ సరికొత్త రికార్డును నెలకోల్పారు. 2008 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఒబామాకు 6.97 కోట్లకు పైగా ఓట్లు పోలయ్యాయి. దీంతో అధ్యక్ష పదవికి పోటీ చేసిన వారిలో ఇప్పటివరకు ఒబామాకే ఎక్కువ ఓట్లు పడ్డాయి. తాజా ఎన్నికల్లో బైడెన్, ఒబామా కంటే 3లక్షలపైగా అధిక ఓట్లు సాధించినట్లు నేషనల్‌ పబ్లిక్‌ రేడియో వెల్లడించింది. కాగా, అధ్యక్ష పీఠానికి కావాల్సిన మ్యాజిక్ ఫిగర్(270)కి చేరువలో జో బైడెన్ ఉన్నారు. ఇప్పటివరకు బైడెన్‌ 264 ఎలక్టోరల్‌ ఓట్లు సాధించగా, డోనాల్డ్‌ ట్రంప్‌ కు 214 ఓట్లు లభించాయి. మొత్తం 50 రాష్ట్రాల్లో ఇప్పటివరకు 45 రాష్ట్రాల్లో ఫలితాలు రాగా, మరో 5 రాష్ట్రాల్లో కౌంటింగ్ జరుగుతుండడంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

US Election 2020: Joe Biden breaks Obama’s Record

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News