Sunday, September 22, 2024

ఓటు వేసిన వారే అభివృద్ధిపై మాట్లాడాలి

- Advertisement -
- Advertisement -

KTR who cast their right to Vote

 

ప్రజాస్వామ్యంలో ఓటుకు అత్యంతప్రాధాన్యత ఉంది
రాష్ట్ర మంత్రి,టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్
ఓటు హక్కు వినియోగించుకున్న కెటిఆర్, సంతోష్,కవిత, మంత్రులు

మనతెలంగాణ/హైదరాబాద్: రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును వినియోగించుకున్న వారికే అభివృద్ధిని ప్రశ్నించే హక్కు ఉంటుందని రాష్ట్ర మంత్రి, టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు చెప్పారు. అభివృద్ధి కావాలని కోరుకునే వారంతా ఖచ్చితంగా ఓటువేసి తమనాయకుడిని ఎన్నుకోవాలని చెప్పారు. హైదరాబాద్ అభివృద్ధిని కోరుకుంటూ తాను ఓటువేశానని కెటిఆర్ చెప్పారు. మంగళవారం గ్రేటర్ ఎన్నికల్లో పాల్గొని బంజారాహిల్స్‌లోని నందీనగర్ కమ్యూనిటీ హాల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో కెటిఆర్ తన సతీమణి శైలిమాతో కలసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ ప్రజాసమస్యలపై ప్రశ్నించే హక్కు ఓటు వేసినవారికే ఉంటుందన్నారు. హైదరాబాద్ అభివృద్ధికోసం ఎలాంటి వారుండాలో ప్రజలు ఆలోచించి ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన కోరారు. శాసనమండలి సభ్యురాలు కల్వకుంట్ల కవిత బంజారాహిల్స్‌లోని రోడ్ నంబర్ 14లో డిఎస్ డిఎఎ పబ్లిక్ పాఠశాలలో ఓటు హక్కు వినియోగించుకున్నారు.

ఈ సందర్భంగా ఎంఎల్‌సి కవిత మాట్లాడుతూ గ్రేటర్ ఎన్నికల్లో ఓటింగ్ శాతం తక్కువ అవుతుందని విచారం వ్యక్తం చేశారు. ప్రజల భాగస్వామ్యంతో ప్రజాస్వామ్యం పరిపూర్ణత సాధించాలంటే ఓటుహక్కు వారంతా తమ హక్కును వినియోగించుకోవాలని కోరారు. చలితీవ్రతతో ఓటింగ్ శాతం నెమ్మదిగా జరగుతుందన్నారు. ఈ ఎన్నికల్లో టిఆర్‌ఎస్ పూర్తి స్థాయి విజయం సాధిస్తుందని మీడియా అడగిన ప్రశ్నలకు కవిత సమాధానం చెప్పారు. ఖైరతాబాద్ సర్కిల్ సోమాజిగూడ వార్డు 97, సెంటర్ ఫర్ ఎకనామిక్స్ అండ్ సోషల్ స్టడీస్‌లో ఏర్పాటుచేసిన పోలింగ్ కేంద్రంలో రాష్ట్ర గిరిజన స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. హైదరాబాద్‌లో మొదటి సారి ఓటు హక్కును వినియోగించుకుంటున్నట్లు సత్యవతి రాథోడ్ చెప్పారు. రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమ్మద్ మహమూద్ అలీ దంపతులు ఆజంపురలోని పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు.

ఓటుహక్కు వినియోగించుకున్న సంతోష్

ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు ప్రాధాన్యతను వివరిస్తూ రాజ్యసభసభ్యుడు జోగినపల్లి సంతోష్‌కుమార్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మంగళవారం ఉదయం షేక్‌పేట డిజన్‌లోని అపెక్స్ హైస్కూల్‌లో ఆయన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా సంతోష్‌కుమార్ మాట్లాడుతూ ఓటు హక్కువినియోగించుకోవడం మనబాధ్యతని చెప్పారు. భివృద్ధి వేగంగా సాధించాలంటే సమర్ధులైన నాయకులను ఎన్నికోవాలని ఆయన చెప్పారు. వెస్ట్ మారేడ్‌పల్లిలోని కస్తూరిబా ఉమెన్స్ కాలేజీలో ఓటుహక్కును మంత్రి తలసాని వినియోగించుకున్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రేటర్ ఎన్నికల్లో టిఆర్‌ఎస్ సెంచరీ కొడుతుందనే ఆశాభావం వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News