- Advertisement -
అమరావతి: ఎపిలో కరోనా పాజిటివ్ కేసులు భారీగా తగ్గాయి. గడిచిన 24గంటల్లో 64,425 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 520 కొత్త కోవిడ్-19 కేసులు, 2 మరణాలు నమోదయ్యాయి. దీంతో ఎపిలో మొత్తం కరోనా పాజిటివ్ కేసులు 8.74 లక్షలకు చేరాయి. ఇప్పటివరకు కరోనాతో 7,049 మంది మృతి చెందారు. ఆంధ్రలో ప్రస్తుతం 5,236 యాక్టివ్ కేసులుండగా.. 8.62 లక్షల మంది బాధితులు కోలుకుని ఇళ్లకు చేరుకున్నారు. ఎపిలో మొత్తం కరోనా టెస్టులు 1.06కోట్లకు చేరుకున్నాయని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది.
520 New Covid 19 Cases Reported in Andhra Pradesh
- Advertisement -