Friday, September 20, 2024

ఛత్తీస్‌గఢ్‌లో 8 మంది నక్సల్స్ లొంగుబాటు

- Advertisement -
- Advertisement -

8 Naxals surrender in Chhattisgarh

దంతెవాడ: నక్సల్ ప్రభావిత ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ జిల్లాలో ఎనిమిది మంది నక్సల్స్ పోలీసుల ఎదుట లొంగిపోయారు. గత ఏడాది ఏప్రిల్‌లో జరిగిన బిజెపి ఎమ్మెల్యే హత్యతో సంబంధమున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నలుగురు నక్సల్స్ కూడా లొంగిపోయిన వారిలో ఉన్నారు. మావోయిస్టు డొల్ల సిద్ధాంతాల పట్ల విరక్తి చెంది లొంగిపోవాలని తాము నిర్ణయించుకున్నట్లు సోమవారం సీనియర్ పోలీసు అధికారులు, సిఆర్‌పిఎఫ్ అధికారుల ఎదుట లొంగిపోయిన నక్సల్స్ చెప్పినట్లు దంతెవాడ ఎస్‌పి అభిషేక్ పల్లవ తెలిపారు.

జిల్లా పోలీసులు ఇటీవల చేపట్టిన లాన్ వర్రాటు(స్వగ్రామానికి లేదా సొంత ఇంటికి వాపసు) కార్యక్రమంలో భాగంగా కొందరు నక్సల్స్ లొంగిపోవడంతో ఇతర నక్సల్స్ కూడా వారి బాట పడుతున్నారని ఆయన చెప్పారు. లొంగిపోయిన నక్సల్స్‌లో మావోయిస్టుల ప్లటూన్ నంబర్ 13 సెక్షన్ కమాండర్‌గా పనిచేస్తున్న అయితు భాస్కర్(25) తలపై రూ. 3 లక్షల రివార్డు ఉందని ఎస్‌పి చెప్పారు. దంతెవాడలోని శ్యామగిరి ప్రాంతంలో గత ఏడాది ఏప్రిల్‌లో ఐఇడి పేలుడుతో బిజెపి ఎమ్మెల్యే భీమా మాండవితోపాటు నలుగురు భద్రతా సిబ్బందిని హతమార్చిన సంఘటనతో సంబంధమున్నట్లు అనుమానిస్తున్న నక్సల్స్ భీమా బర్సె(28), సోనా తాతి(20), మడ్కా బర్సా(21), పిట్టె అలియాస్ భీమా మాండవి(35) కూడా లొంగిపోయిన వారిలో ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News