Friday, September 20, 2024

అమెరికాలో కొవిడ్19 కొత్తరకం వైరస్

- Advertisement -
- Advertisement -

First case of new Covid-19 Strain in Colorado

 

కొలరాడోలో మొదటి కేసు గుర్తింపు

వాషింగ్టన్ : బ్రిటన్‌లో బయటపడిన కొత్తరకం కరోనా వైరస్ అమెరికా లోని కొలరాడో రాష్ట్రంలో కూడా బయటపడింది. కొలరాడో లో మొదటి కేసు నమోదైనట్టు గవర్నర్ జేర్డ్ పొలిస్ వెల్లడించారు. డెన్వర్ ఆగ్నేయ ప్రాంతంలో 20 ఏళ్ల యువకునిలో ఈ కొత్తరకం వైరస్‌ను గుర్తించారు. ఆయన ఎక్కడకూ వెళ్లిన దాఖలాలు లేవని ఆరోగ్య శాఖ అధికారులు మంగళవారం తెలిపారు. కొలరాడో స్టేట్ లేబొరేటరీ ఇది కొత్తరకమేనని నిర్ధారించింది. సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ దీన్ని పరిగణన లోకి తీసుకుంది. ఇదివరకు గుర్తించిన సార్స్‌కొవి 2 స్ట్రెయిన్లు కన్నా ఈ కొత్తరకం వైరస్ తీవ్రంగా వ్యాప్తిచెందుతుందని బ్రిటన్ శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ కొత్త వైరస్‌ను ప్రస్తుతం ఉన్న వ్యాక్సిన్లు సమర్ధంగా నిరోధిస్తాయని కొలరాడ్ ఆరోగ్య అధికారులు ప్రకటించారు. కొలరాడ్ ప్రజల ఆరోగ్యమే తమకు ప్రధానమని ఇప్పుడీ కొత్త కేసుకు సంబంధించిన వివరాలు సేకరించి నివారణకు చర్యలు తీసుకుంటామని గవర్నర్ జేర్డ్ పొలిస్ పేర్కొన్నారు. బ్రిటన్ నుంచి అమెరికాకు వచ్చేవారు తప్పనిసరిగా కరోనా నెగిటివ్ ప్రూఫ్ చూపించాలని అమెరికా ప్రభుత్వం వెల్లడించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News