Friday, November 22, 2024

దేశంలో మరో నలుగురికి కరోనా స్ట్రెయిన్

- Advertisement -
- Advertisement -

4 more test positive of Covid-19 UK strain in India

ఇప్పటివరకూ ఈ కేసుల సంఖ్య 29

న్యూఢిల్లీ: దేశంలో మరో నాలుగు బ్రిటన్ కొత్త కొవిడ్ స్ట్రెయిన్‌లు నమోదు అయ్యాయి. దీనితో ఇప్పటివరకూ భారత్‌లో ఇటువంటి కేసుల సంఖ్య 29కు చేరుకుంది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ శుక్రవారం ఈ వివరాలను వెల్లడించింది.మొత్తం 29 కేసులలో 10 బెంగళూరులోని ఎన్‌ఐఎంహెచ్‌ఎఎన్‌ఎస్‌లో, ఎనిమిది న్యూఢిల్లీలోని ఎన్‌సిడిసిలో, రెండు ఐజిఐబిలో, పుణేలోని ఎన్‌ఐవిలో ఐదు , కళ్యాణిలోని ఎన్‌ఐబిఎంజిలో ఒకటి నిర్థారణ అయింది. ఇక హైదరాబాద్‌లోని సిసిఎంబిలో 3 కేసులు నిర్థారణ అయ్యాయి. బ్రిటన్ నుంచి వచ్చిన ప్రయాణికులకు ఆరోగ్య పరీక్షలు, వారి శాంపుల్స్ తనిఖీల దశలో ఇప్పటివరకూ 29 మందికి ప్రమాదకరమైన ఈ స్ట్రెయిన్ సోకినట్లు వెల్లడికావడంతో ఆరోగ్య శాఖ అప్రమత్తం అయింది. మంగళ, బుధవారాలలో 20 మందికి ఇటువంటి కొవిడ్ పాజిటివ్ నిర్థారణ అయింది. శుక్రవారం నలుగురికి ఈ వైరస్ ఉన్నట్లు గుర్తించారు. ఇప్పుడు శనివారం నలుగురికి వ ఈ వైరస్ వచ్చినట్లు కనుగొన్నారు.

సిసిఎంబి ఇతర కేంద్రాలలో శాంపుల్స్ టెస్టులు జరిగాయి. డిసెంబర్ నెలలోనే బ్రిటన్‌లో ఈ కొత్త రకం కరోనా వైరస్‌ను గుర్తించారు. దీనితో భారత్‌తో పాటు పలు దేశాలూ బ్రిటన్‌కు విమాన రాకపోకలను నిలిపివేశాయి. బ్రిటన్‌లో పూర్తి స్థాయి లాక్‌డౌన్ విధించారు. మొదటి రకం కరోనా నుంచి ప్రపంచంలో యువత తట్టుకుంది. అయితే ఈ రెండో రకపు కరోనా యువతను కూడా ప్రభావితం చేస్తున్నట్లు, వారి ఆరోగ్యాన్ని దెబ్బతీసినట్లు గుర్తించారు. దీని ప్రభావం ఎక్కువగా ఉంటుందని తేలడంతో పలు రాష్ట్రాలలో తాజా కొవిడ్ ఆంక్షలు విధించారు. ఇప్పటివరకూ కొత్త రకం కరోనా వైరస్ సోకిన వారిని వెనువెంటనే పలు ఆరోగ్య కేంద్రాలలో ఐసోలేషన్‌కు పంపించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కొత్త స్ట్రెయిన్ వ్యాప్తి చెందకుండా చర్యలు చేపట్టారు. బ్రిటన్ నుంచి వచ్చిన వారికి, వారితో పాటు దేశంలో వేర్వేరు ప్రాంతాలకు పర్యటించిన వారికి కూడా ముందు జాగ్రత్త చర్యగా పరీక్షలు నిర్వహిస్తున్నారు. వారి కుటుంబ సభ్యులకు, ఇతరులకు కూడా టెస్టులు నిర్వహిస్తున్నారు.

4 more test positive of Covid-19 UK strain in India

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News