Sunday, November 24, 2024

ఎపిలో కొత్తగా 238 కరోనా కేసులు..

- Advertisement -
- Advertisement -

238 New Corona Cases Registered in AP

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో రోజురోజుకు కరోనా పాజిటీవ్ కేసులు భారీ తగ్గుముఖం పట్టాయి. ఎపిలో గడచిన 24 గంటల్లో కొత్తగా 238 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ  అయిందని, వైరస్ కారణంగా మరో ముగ్గురు ప్రాణాలు కోల్పోయినట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. దీంతో ఎపిలో మొత్తం కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య 8,82,850కు చేరింది. కరోనాతో ఇప్పటివరకు 7,111 మంది కరోనా బాధితులు మరణించారు. ఎపిలో ప్రస్తుతం 3194 కరోనా యాక్టీవ్ కేసులు ఉన్నాయి. ఇక, కరోనా నుంచి కోలుకొని 8 లక్షల 82 వేలకు పైగా బాధితులు డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 1,19,32,603 మందికి పైగా కరోనా పరీక్షలు చేసినట్లు వైద్యశాఖ పేర్కొంది.

238 New Corona Cases Registered in AP

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News