Friday, September 20, 2024

మొదటి లైన్‌మెన్‌గా రికార్డు సృష్టించిన మహిళలు

- Advertisement -
- Advertisement -

First Linewoman in Telangana

విద్యుత్‌శాఖలో శిరీష,భారతి
కోర్టు జోక్యంతో త్వరలో వారికి ఉద్యోగాలు

హైదరాబాద్: అకాశంలో సగం, అవకాశాల్లో సగం అన్న చందంగా నేటి మహిళలు అన్ని రంగల్లో దూసుకుపోయి తాము పురుషులకు ఏ మాత్రం తక్కువ కాదని రుజువు చేస్తున్నారు. నేటి పురుషాధిక్య సమాజంలో ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా తమ హక్కుల సాధన కోసం చివరకు న్యాయస్థానాన్ని ఆశ్రయించి చివరకు పట్టువదలని విక్రమార్కుల్లా వారి లక్షాన్ని సాధించుంకునేందుకు ఏ మాత్రం వెనుకాడటం లేదు. విద్యుత్ శాఖల్లో కేవలం పురుషులకు మాత్రమే సాధ్యం అవుతుందనుకుంటున్న లైన్ మెన్ ఉద్యోగాన్ని ఇద్దరు మహిళలు సాధించారు. వివరాల్లోకి వెళితే సిద్దిపేట జిల్లా చేపర్ది అనే గ్రామానికి చెందిన శిరీష (20) ఐటిఐ చదివి ప్రభుత్వం విడుదల చేసిన లైన్‌మెన్ ఉద్యోగానికి దరఖాస్తు చేసింది. పరీక్షలో పాసై తమ మామ సాయంతో పోల్ ఎక్కడం సైతం నేర్చుకుంది. అదే విధంగా వరంగల్ జిల్లాలోని మారు మాల గ్రామానికి చెందిన ఇద్దరు పిల్లల తల్లి అయిన వి. భారతి తన భర్త సాయంతో పోల్ ఎక్కడం నేర్చుకుని 8 మీటర్లు ఉన్న పోల్‌లను ఎక్కి ఉద్యోగం సాధించుకుంది.

ఇంత వరకు బానే ఉన్నా వారు ఉద్యోగాన్ని సాధించడంలో అనేక సమస్యలను ఎదుర్కోన్నారు. అయితే విద్యుత్ సంస్థలు ఈ ఉద్యోగాలు పురుషులకు మాత్రమే అని వివక్ష చూపాయి. దాంతో వారు తెలంగాణ హై కోర్టును ఆశ్రయించారు. కోర్టు జోక్యంతో వారి అభ్యర్దనను పరిగణలోకి తీసుకోవాలని సూచింది. దాంతో వారికి రాత పూర్వక పరీక్షను కూడా నిర్వహించారు. ఇందుకు సంబంధించిన పరీక్షా ఫలితాలను సైతం అధికారులు ఆపారు. దాంతో వారు తిరిగి హై కోర్టు మెట్లు ఎక్కారు. దీంతో పరీళక్షా ఫలితాలను విడుదల చేయాల్సింది కోర్టు ఆదేశాలు జారీ చేసింది. చేసేది ఏమీ లేక విద్యుత్ సంస్థలు పరీక్షా ఫలితాలను విడుదల చేశాయి. వాటిలో శిరీష, భారతి ఉత్తీర్ణత సాధించారు.

అయితే అధికారులు వారికి రెండో దశ పరీక్షలైన పోల్ టెస్ట్ నిర్వహించేది లేదని చెప్పారు. వారి మళ్ళీ ధర్మాసనం తలుపులను తట్టారు. సారి కోర్టు మొట్టికాయలు వేసి పోల్‌టెస్ట్ నిర్వహించాలని చెప్పింది. దాంతో కోర్టు ఆదేశాలతో అధికారులు పోల్‌టెస్ట్ కూడా నిర్వహించారు. అధికారులు నిర్వహించిన పోల్‌టెస్టులో కూడా వారు విజయం సాధించారు. ప్రస్తుతం వారికి విద్యుత్ శాఖలో ఉద్యోగం లభించనుంది. అయితే ఉత్వర్వుల కోసం వారు హై కోర్టు సింగిల్ బెంచ్ ముందు హజరు కావాల్సి ఉంది. వారి తరుపున వాదించిన న్యాయవాది సత్యం రెడ్డి తెలిపారు. దీంతో వారు పురుషులకు మాత్రమే సాధ్యం అవుతుందనుకున్న లైన్ మెన్ వారు మెదటి సారిగా విద్యుత్‌శాఖలో మొదటి లైన్‌మెన్ ఉద్యోగాలు సాధించి చరిత్ర సృష్టించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News