Friday, November 22, 2024

ఎపిపై రూ.3.73 లక్షల కోట్ల అప్పుల భారం: కాగ్

- Advertisement -
- Advertisement -

Rs 3.73 lakh crore debt burden on AP: CAG

మనతెలంగాణ/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై రూ.3.73 లక్షల కోట్ల అప్పుల భారం ఉన్నట్టు కాగ్ వెల్లడించింది. గతేడాది నవంబరు నాటికే రూ.3.73 లక్షల కోట్లు రుణం దాటిందన్న కాగ్ గతేడాది ఏప్రిల్-నవంబర్ మధ్య రూ.73,811 కోట్లు అప్పు చేసినట్లు పేర్కొంది. ఒక్క నవంబరులోనే రూ.13 వేల కోట్లు అప్పు తీసుకున్నట్లు కాగ్ తెలిపింది. ఈక్రమంలో కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) తాజా నివేదికలో ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. గతేడాది నవంబరు నాటికే రూ.3.73,140 కోట్లకు చేరిందని వివరించింది. గతేడాది ఏప్రిల్-నవంబరు మధ్య రూ.73,811 కోట్లు అప్పు చేశారని కాగ్ తెలిపింది. ఒక్క నవంబరు మాసంలోనే రూ.13 వేల కోట్ల రుణం తీసుకున్నట్టు వెల్లడైందని వివరించింది.2020-21 సీజన్ లో పరిశీలిస్తే ఎపి సర్కారు నెలకు సగటున రూ.9,226 కోట్ల మేర అప్పు చేసినట్టు కాగ్ పేర్కొంది. ఇదే ఒరవడి కొనసాగితే మాత్రం 2021 మార్చి నాటికి ఏపీ ప్రభుత్వం మరో రూ.30 వేల కోట్లు అప్పు చేయొచ్చని వెల్లడించింది. అదే జరిగితే ఈ 2020-21 సీజన్ లో ఎపి అప్పుల భారం రూ.1.04 లక్షల కోట్లకు చేరుతుందని వివరించింది.2014లో రాష్ట్ర విభజన సమయానికి ఎపి అప్పుల విలువ రూ.97,000 కోట్లు కాగా, 2019 మార్చి నాటికి అది .2,58,928 కోట్లకు పెరిగింది. ఆ తర్వాత కూడా అప్పులు పరంపర కొనసాగింది. 2019 ఏప్రిల్ నుంచి 2020 నవంబరు వరకు రూ.1,14,212 కోట్లను రుణాల రూపేణా వివిధ బ్యాంకులు, ఇతర మార్గాల్లోనూ స్వీకరించారు.

Rs 3.73 lakh crore debt burden on AP: CAG

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News