హైదరాబాద్: విద్యార్థులు ఎంతో విషయ పరిజ్ఞానంతో ప్రాజెక్టులు ప్రదర్శించారని మంత్రి కెటిఆర్ ప్రశంసించారు. ఎంసిహెచ్ఆర్డిలోని రాష్ట్ర స్కూల్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ 2020 కార్యక్రమంలో కెటిఆర్ మాట్లాడారు. ఉత్తమ ప్రాజెక్టులు డిజైన్ చేసిన విద్యార్థులకు కెటిఆర్ బహుమతులు ప్రదానం చేశారు. స్కూల్ ఇన్నోవేషన్ ఛాలెంజ్‌లో 23 వేల మంది విద్యార్థులను భాగస్వామ్యం చేశామని, 11 నెలల పాటు ఈ కార్యక్రమం కొనసాగిందన్నారు. గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు ఎలాంటి బెరుకు లేకుండా ప్రాజెక్టుల గురించి వివరించారని, తెలుగు మీడియం విద్యార్థులైన ఇంగ్లీష్‌లో వివరించిన తీరు ఆకట్టుకుంటుందన్నారు. పది మంది ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి నేటి యువత చేరుకోవాలన్నారు. దేశంలో యువత ఎక్కువగా ఉందని, ప్రపంచానికే పరిష్కారం చూపించే సత్తా మన దేశానికి ఉందని తెలియజేశారు. యువతను ప్రోత్సహిస్తే ఎన్నో ఆవిష్కరణలు చేసే సత్తా ఉందని, జిల్లాల వారీగా ఇన్నోవేషన్ ఛాలెంజ్ కార్యక్రమాలు నిర్వహించాలని కెటిఆర్ సూచించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, రాష్ట్ర రైతు బంధు సమితి చైర్మన్ పల్లా రాజేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు.
Live: Minister @KTRTRS speaking at the Telangana School Innovation Challenge 2020 Grand Finale in Hyderabad https://t.co/MJX3VBYybZ
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) January 4, 2021