న్యూఢిల్లీ: పార్లమెంటు వార్షిక బడ్జెట్ సమావేశాలు ఈ నెల 29నుంచి ప్రారంభమయ్యే అవకాశముంది. ఈ మేరకు పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్ ఉపసంఘం నిర్ణయించినట్లు సమాచారం. తొలి విడతగా జనవరి 29నుంచి ఫిబ్రవరి 15 వరకు, అనంతరం మార్చి 8నుంచి ఏప్రిల్ 8 వరకు రెండో విడత సమావేశాలు నిర్వహించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు కేంద్ర ఆర్థిక శాఖ సమాయత్తమవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇటీవల ప్రముఖ ఆర్థిక నిపుణులు, వాణిజ్య వేత్తలతో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భేటీ అయ్యారు. అయితే పార్లమెంటు సమావేశాల నిర్వహణపై కేంద్ర కేబినెట్‌నుంచి స్పష్టత రావలసి ఉంది. వార్షిక బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో జనవరి 29న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఉభయసభలనుద్దేశించి ప్రసంగించనునన్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో సమావేశాల సందర్భంగా కొవిడ్ నిబంధనలను పక్కాగా అమలు చేయనున్నారు.
29నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు
- Advertisement -
- Advertisement -
- Advertisement -