హైదరాబాద్: సిఎస్ సోమేశ్ కుమార్ అధ్యక్షతన తెలంగాణ బ్రాడ్ బ్యాండ్ కమిటీ రెండవ సమావేశం బుధవారం బిఆర్కెఆర్ భవన్లో జరిగింది. ఈ సమావేశంలో సిఎస్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో 24,961 సెల్ టవర్లు ఉన్నాయి. రాష్ట్రంలో ఇంకా 34,902 సెల్ టవర్లు నిర్మించాల్సి ఉంది. నేషనల్ బ్రాడ్ బ్యాండ్ మిషన్ 2024 సంవత్సరం నాటికి 1.7 శాతానికి లక్ష్యంగా విధించిందని తెలిపారు. బేస్ స్టేషన్లు టవర్స్ ఫైబరైజేషన్, విస్తరణకు సహకారం ఇస్తున్నామన్నారు. తెలంగాణలో టవర్స్ ఫైబరైజేషన్ 35 శాతం ఉంది. జాతీయ బ్రాడ్ బ్యాండ్ మిషన్ విధించిన 70శాతం లక్ష్యాన్ని చేరుకుంటామని సిఎస్ వెల్లడించారు. 109 చోట్ల టవర్లు ఏర్పాటుకు అవసరమైన అనుమతులు జారీ చేస్తామని ఆయన పేర్కొన్నారు. సిగ్నలింగ్ సరిగాలేని 140 పంచాయతీలపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తామన్నారు. ఈ భేటీలో రహదారులు, భవనాలశాఖ ముఖ్య కార్యదర్శి సునీల్ శర్మ, ఐటిశాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, అడ్వైజర్, డివొటి-ఎల్ఎస్ఎ యూనిట్, హైదరాబాద్, తెలంగాణ జె.వి. రాజా రెడ్డి, డైరెక్టర్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.