Sunday, November 24, 2024

రాజ్‌భవన్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు

- Advertisement -
Traffic diversion at Raj Bhavan
తెలంగాణ హైకోర్టు ఛీఫ్ జస్టిస్ ప్రమాణ స్వీకారం
- Advertisement -

హైదరాబాద్: హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లీ ప్రమాణ స్వీకారం సందర్భంగా రాజ్‌భవన్ పరిసరాల్లో గురువారం ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ నగర ట్రాఫిక్ పోలీస్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. రాజ్‌భవన్ రోడ్డు మోనప్ప ఐస్‌ల్యాండ్ నుంచి వివి స్టాట్యూ జంక్షన్ వరకు ఉదయం 10 గంటల నుంచి 1గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉండనున్నాయి. మెనప్ప ఐస్‌ల్యాండ్, వివి స్టాట్యూ జంక్షన్, పంజాగుట్టరాజ్‌భవన్ క్వార్టర్స్ రోడ్డును మూసివేయనున్నారు. గేట్ నంబర్ 3 నుంచి అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్‌కు జడ్జిలు, ఎంపిలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల వాహనాలు లోపలికి రావాలి. మీడియా వాహనాలను దిల్‌కుషా గెస్ట్‌హౌస్ వద్ద పార్కింగ్ చేయాలి. ఎంఎంటిఎస్ పార్కింగ్ లాట్‌లో విఐపిల వాహనాలు, ప్రభుత్వ అధికారుల వాహనాలను నిలుపాలి. మెట్రో రెసిడెన్సీ నుంచి నాసర్ స్కూల్ వరకు సింగిల్ లైన్ రోడ్డు పార్కింగ్, లేక్‌వ్యూ నుంచి వివి స్టాట్యూ జంక్షన్ వరకు సింగిల్ లైన్ రోడ్డును వాహనాల పార్కింగ్‌కు కేటాయించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News