Friday, November 22, 2024

ప్రేమించిన యువకుడితో పెళ్లి చేయలేదని యువతి ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

కొమురంభీమ్ ఆసిఫాబాద్: ప్రేమించిన యువకుడితో పెళ్లి చేయడంలేదని ఓ యువతి ఆత్మహత్య చేసుకున్న సంఘటన కొమురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చిన్నవాంకిడికి గ్రామానికి చెందిన మౌనిక, రంజిత్‌లు గత సంవత్సరం నుంచి ప్రేమించుకుంటున్నారు. మౌనికను పెళ్లి చేసుకుంటానని రంజిత్ ఆమె ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను అడిగాడు. మౌనిక కుటుంబ సభ్యులు ప్రేమ పెళ్లికి నిరాకరించారు. దీంతో రంజిత్ మరో యువతిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యాడు. మౌనిక మనస్తాపానికి గురై మంగళవారం ఉదయం ఇంట్లో నుంచి బయటకు వెళ్లింది. బయటకు వెళ్లిన యువతి ఇంటికి రాకపోయేసరికి ఊరంతా వెతికారు. ఎక్కడ మౌనిక ఆచూకీ లభించకపోవడంతో సొంత పత్తి చేనులో వెతకడంతో ఆమె శవం కనిపించింది. పురుగుల మందు డబ్బా ఆమె పక్కనే కనిపించింది. నోట్లో నుంచి నురుగులు రావడంతో ఆమె ఆత్మహత్య చేసుకొని ఉండొచ్చిన గ్రామస్థులు భావిస్తున్నారు. గ్రామస్థుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం వాంకిడి ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News