Friday, November 22, 2024

కెసిఆర్ కు ఆరోగ్యపరంగా ఎలాంటి ఇబ్బంది లేదు: వైద్యులు

- Advertisement -
- Advertisement -

Complete medical examinations for CM KCR

హైదరాబాద్: సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో సిఎం కెసిఆర్ కు వైద్య పరీక్షలు పూర్తి అయ్యాయి. వైద్య పరీక్షలు పూర్తి అనంతరం సిఎం ప్రగతిభవన్ కు వెళ్లారు. ఊపిరితిత్తుల్లో మంటగా ఉండటంతో నిన్న సిఎం కెసిఆర్ వైద్య పరీక్షలు నిర్వహించారు. వ్యక్తిగత వైద్యుల సూచన మేరకు ముఖ్యమంత్రి కెసిఆర్ గురువారం యశోద దవాఖానకు వెళ్లి మరికొన్ని పరీక్షలు చేయించుకున్నారు. కెసిఆర్ ఆరోగ్యంపై వైద్యులు స్పందించారు. కెసిఆర్ కు లంగ్స్ లో మైల్డ్ ఇన్ ఫెక్షన్ ఉందని వారు వెల్లడించారు. కెసిఆర్ కు ఐదురోజుల మందులు ఇచ్చామని, బ్లడ్ రిపోర్ట్స్, 2డి ఎకో రిపోర్టులు రావాల్సి ఉందని వారు పేర్కొన్నారు. ప్రతి శీతాకాలం బ్రాంకెయిటీస్ సమస్య ఇబ్బంది ఉంటుందని, కెసిఆర్ కు ఆరోగ్యపరంగా ఎలాంటి ఇబ్బంది లేదని వారు వెల్లడించారు. కెసిఆర్ కు అన్ని  పరీక్షలు చేశామని వారు స్పష్టం చేశారు.

Complete medical examinations for CM KCR

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News