రూ. 2508 కోట్ల అదనపు రుణం తీసుకునేందుకు కేంద్రం అనుమతి
ఇప్పటి వరకు మూడు రాష్ట్రాలకు రూ. 7406 కోట్ల అదనపు రుణాలకు గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్ : పట్టణ స్థానిక సంస్థల సంస్కరణలను అమలు చేసిన మూడవ రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. ఇందుకుగానూ రూ.2508 కోట్ల అదనపు రుణం తీసుకునేందుకు రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. పట్టణ స్థానిక సంస్థల్లో సంస్కరణలు అమలు చేసినందుకు వెసులుబాటు కల్పిస్తున్నట్లు పేర్కొన్నది. పట్టణ స్థానిక సంస్థల్లో సంస్కరణలు అమలు చేసిన రాష్ట్రాల్లో మొదటి మూడు స్థానాలను ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు దక్కించుకున్నారు. దీంతో మూడు రాష్ట్రాలకు ఇప్పటివరకు మంజూరు చేసిన రూ .7,406 కోట్ల అదనపు రుణాలకు కేంద్రం అనుమతి ఇచ్చినట్లు అయింది. ఈ మూడు రాష్ట్రాలతో పాటు వన్ నేషన్…వన్ రేషన్ కార్డు వ్యవస్థను ఇప్పటివరకు 10 రాష్ట్రాలు విజయవంతంగా అమలు చేయగా, 7 రాష్ట్రాలు సులభతర వాణిజ్య సంస్కరణలను చేయడంలో సులువుగా చేశాయి. సంస్కరణలను అమలు చేసిన రాష్ట్రాలకు ఇప్పటివరకు కేంద్రం జారీ చేసిన మొత్తం అదనపు రుణ అనుమతి రూ .54,190 కోట్లకు చేరింది.
పట్టణ స్థానిక సంస్థల్లో సంస్కరణలు అమలు చేసిన రాష్ట్రాల్లో మొదటి మూడు స్థానాలను ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు దక్కించుకున్నారు. దీంతో మూడు రాష్ట్రాలకు ఇప్పటివరకు మంజూరు చేసిన రూ .7,406 కోట్ల అదనపు రుణాలకు కేంద్రం అనుమతి ఇచ్చినట్లు అయింది. ఈ మూడు రాష్ట్రాలతో పాటు వన్ నేషన్…వన్ రేషన్ కార్డు వ్యవస్థను ఇప్పటివరకు 10 రాష్ట్రాలు విజయవంతంగా అమలు చేయగా, 7 రాష్ట్రాలు సులభతర వాణిజ్య సంస్కరణలను చేయడంలో సులువుగా చేశాయి. సంస్కరణలను అమలు చేసిన రాష్ట్రాలకు ఇప్పటివరకు కేంద్రం జారీ చేసిన మొత్తం అదనపు రుణ అనుమతి రూ .54,190 కోట్లకు చేరింది. రాష్ట్రంలోని యుఎల్‌బిలను ఆర్థికంగా బలోపేతం చేయడంతో పాటు ప్రజలకు మెరుగైన ప్రజారోగ్యం, పారిశుధ్య సేవలను అందించాలన్న లక్షంతో కేంద్రం వివిధ అంశాల్లో సంస్కరణలను అమలు చేస్తోంది. వీటిని అమలు చేసిన రాష్ట్రాలను ప్రొత్సహించాలన్న లక్షంతో అదనపు రుణాం తీసుకునేందుకు అనుమతులను ఇస్తోంది. ప్రతి రంగంలో సంస్కరణలు పూర్తి అయిన తరువాత జిఎస్‌డిపిలో 0.25 శాతానికి సమానమైన అదనపు నిధులును సేకరించడానికి రాష్ట్రాలకు ఈ అనుమతి లభిస్తోంది.
Telangana ranks 3rd in implementing urban local body reforms