Sunday, November 24, 2024

తొలిరోజు కంగారూలదే పైచేయి

- Advertisement -
- Advertisement -

తొలిరోజు కంగారూలదే పైచేయి
రాణించిన పకోస్కి, లబుషేన్.. ఆస్ట్రేలియా 166/2

Australia 166/2 at Stumps on Day One Against India

సిడ్నీ: భారత్‌తో గురువారం ప్రారంభమైన మూడో టెస్టులో ఆతిథ్య ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 56 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే ఆట ప్రారంభమైన కొద్ది సేపటికే వర్షం మొదలైంది. తొలి సెషన్‌లో 7.1 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. ఇక ముందుగా బ్యాటింగ్ చేపట్టిన ఆస్ట్రేలియాకు ప్రారంభంలోనే షాక్ తగిలింది. టెస్టు సిరీస్‌లో తొలిసారి బరిలోకి దిగిన స్టార్ ఓపెనర్ డేవిడ్ విఫలమయ్యాడు. 8 బంతులు ఎదుర్కొన్న వార్నర్ ఐదు పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద వెనుదిరిగాడు. సిరాజ్ వేసిన అద్భుత బంతికి అతను పెవిలియన్ చేరాడు. అప్పటికి జట్టు స్కోరు ఆరు పరుగులు మాత్రమే.
ఆదుకున్న పకోస్కి, లబుషేన్
ఈ దశలో ఇన్నింగ్స్‌ను కుదుట పరిచే బాధ్యతను యువ ఓపెనర్ విల్ పకోస్కి, స్టార్ బ్యాట్స్‌మన్ లబుషేన్ తమపై వేసుకున్నారు. ఇద్దరు భారత బౌలర్లను దీటుగా ఎదుర్కొన్నారు. ఒకవైపు వికెట్‌ను కాపాడుకుంటూనే చెత్త బంతులను బౌండరీలుగా మలిచారు. ఈ జోడీని విడగొట్టేందుకు భారత బౌలర్లు చేసిన ప్రయత్నాలు చాలా సేపటి వరకు ఫలించలేదు. తొలి టెస్టు మ్యాచ్ ఆడుతున్న పకోస్కి అసాధారణ బ్యాటింగ్‌తో అలరించాడు. అద్భుత బ్యాటింగ్‌తో అలరించాడు. లబుషేన్ తన ఫామ్‌ను ఈ మ్యాచ్‌లో కూడా కొనసాగించాడు. ఇద్దరు భారత బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ స్కోరును ముందుకు నడిపించారు. అరంగేట్రం మ్యాచ్‌లోనే పకోస్కి సత్తా చాటాడు. భారత బౌలర్లను దీటుగా ఎదుర్కొన్న పకోస్కి 110 బంతుల్లో నాలుగు ఫోర్లతో 62 పరుగులు చేసి నవ్‌దీప్ సైని బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. సైనికి టెస్టుల్లో ఇదే తొలి వికెట్ కావడం విశేషం. ఈ మ్యాచ్ ద్వారా సైని కూడా టెస్టు క్రికెట్‌కు శ్రీకారం చుట్టాడు. ఇక మరో అరంగేట్రం ఆటగాడు పకోస్కి వికెట్ తీసి అరుదైన ఘనత సాధించాడు. మరోవైపు లబుషేన్‌తో కలిసి రెండో వికెట్‌కు వంద పరుగుల భాగస్వామ్యంలో పాలుపంచుకున్నాడు.
స్మిత్ దూకుడు
తర్వాత వచ్చిన సీనియర్ బ్యాట్స్‌మన్ స్టీవ్ స్మిత్ నిలకడగా ఆడాడు. లబుషేన్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. ఈ జోడీ కూడా భారత బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంది. తొలి రెండు టెస్టుల్లో ఘోరంగా విఫలమైన స్మిత్ ఈసారి మాత్రం ఆరంభం నుంచే ఆత్మవిశ్వాసంతో ఆడాడు. తనకు కొరకరాని కొయ్యగా మారిన అశ్విన్ బౌలింగ్‌లో ఎదురుదాడి చేసేందుకు ప్రయత్నించాడు. తన మార్క్ బ్యాటింగ్‌తో అలరించిన స్మిత్ గురువారం తొలిరోజు ఆట ముగిసే సమయానికి ఐదు ఫోర్లతో 31 పరుగులు చేసి క్రీజులో నిలిచాడు. ఇక అద్భుత ఇన్నింగ్స్ ఆడిన లబుషేన్ 149 బంతుల్లో 8 ఫోర్లతో 67 పరుగులు నాటౌట్‌గా ఉన్నాడు. ఇదే సమయంలో స్మిత్‌తో కలిసి మూడో వికెట్‌కు అజేయంగా 60 పరుగులు జోడించాడు. కాగా, ఈ మ్యాచ్‌లో వర్షం వల్ల దాదాపు నాలుగు గంటల పాటు ఆటకు అంతరాయం కలిగింది. దీంతో మొదటి రోజు కేవలం 56 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. ఇదిలావుండగా నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇరు జట్లు 1-1తో సమంగా నిలిచాయి.

Australia 166/2 at Stumps on Day One Against India

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News