Sunday, November 24, 2024

ఆసీస్ 338

- Advertisement -
- Advertisement -

 

సిడ్నీ: ఆస్టేలియా-భారత్ మధ్య జరుగుతున్న మూడో టెస్టు మొదటి ఇన్నింగ్ రెండో రోజు ఆసీస్ జట్టు 105.4 ఓవర్లలో అన్ని  వికెట్లు కోల్పోయి 338 పరుగులు చేసింది. స్టీవెన్ స్మిత్ సెంచరీతో కదం తొక్కాడు.  లబుసింగ్, విల్ పకోస్కీ హాఫ్ సెంచరీలతో అదరగొట్టారు. స్మిత్ 226 బంతుల్లో 131 పరుగులు చేసి రనౌట్ రూపంలో ఔటయ్యాడు. లాబుసింగ్ 91 పరుగులు చేసి జడేజా బౌలింగ్‌లో రహానే క్యాచ్ ఇచ్చి మైదానం వీడాడు. పకోస్కీ 62 పరుగులు చేసి సైనీ బౌలింగ్ లో ఎల్ బిడబ్ల్యు రూపంలో ఔటయ్యాడు. పకోస్కీ, లబుసింగ్ మొదిటి వికెట్‌పై వంద పరుగులు భాగస్వామ్యం నెలకొల్పగా, స్మిత్, లబుసింగ్ రెండో వికెట్‌పై వంద పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. మిగిలిన ఆసీస్ బ్యాట్స్ మెన్లలో మిచెల్ స్టార్క్(24), మాథ్యూ వాడే(13),  డేవిడ్ వార్నర్(05), టిమ్ పెయిన్(01), హజిల్ వుడ్(01) పరుగులు చేశారు. గ్రీన్, కమ్నీస్, నాథన్ లయన్ పరుగులేమీ చేయకుడా డకౌట్ రూపంలో ఔటయ్యారు. భారత్ బౌలర్లలో రవీంద్ర జడేజా నాలుగు వికెట్టు పడగొట్టగా జస్ప్రీత్ బుమ్రా, సైనీ చెరో రెండు వికెట్లు పడగొట్టగా సిరాజ్ ఒక వికెట్ తీశాడు. లబుసింగ్, పకోసి ఇచ్చిన క్యాచ్ లను కీపర్ రిషబ్ పంత్ పలుమార్లు పట్టుకోవడంలో విఫలంకావడంతో ఆసీస్ భారీ స్కోర్ దిశగా అడుగులు వేస్తోంది. ఈ సిరీస్‌లో రెండు జట్లు 1-1తో సమజ్జీవులుగా ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News