Friday, November 22, 2024

బర్డ్‌ఫ్లూతో భయం.. భయం

- Advertisement -
- Advertisement -

Bird flu fear in Telangana

మనతెలంగాణ/హైదరాబాద్ : కోడిమాసం వినియోగాన్ని కుంగదీస్తూ మార్కెట్‌ను కట్టడి చేసిన కరోనా.. అయ్యప్పదీక్షలు.. కార్తీక మాస పూజలు.. దాటుకుంటూ ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్న ఫౌల్ట్రీ రంగాన్ని బర్డ్ ఫ్లూ భయం వెన్నాడుతోంది. పుంజుకుంటున్న చికెన్ విక్రయాలతో కుదుట పడుతున్న కోళ్ల పరిశ్రమకు మళ్లీ పొంచివున్నాయి. దేశంలోని నాలుగు రాష్ట్రాల్లో బర్డ్‌ఫ్లూ వైరస్ విజృంభిస్తుంటతో కేంద్రం ముందుజాగ్రత్తల కింద రాష్ట్రాలను మరింత అప్రమత్తం చేసింది. ప్రత్యేకించి ఫౌల్ట్రీరంగంలో తగిన ముందు జాగ్రత్తులు నిక్కచ్చిగా అమలు చేయాలని హెచ్చరించింది. దీంతో జంతు ప్రదర్శన శాలలు,వణ్యప్రాణి కేంద్రాల్లో తగిన ముందుజాగ్రత్తలు తీసుకుంటూన్నారు . జంతు ప్రదర్శన శాలలో పలు రకాల పక్షులతో పులులు , సింహాలు వంటి పెద్ద జంతువులు పక్కపక్కనే కలిసే వుంటాయి.

ఈ నేపద్యంలో పక్షుల ద్వారా బర్డ్‌ఫ్లూ వైరస్ వ్యాప్తి చెందే ప్రమాదం పొంచి ఉవండటంతో జంతు ప్రదర్శన కేంద్రాలను రోజుకు రెండు సార్లు శానిటైజ్ చేస్తున్నారు. వైరస్‌తోపాటు ఇతర సూక్ష్మక్రిములను అంతమొందించేందుకు బ్లీచింగ్ పౌడర్లు, ఇతర రసాయనాలతో జూలను శుద్ది చేస్తున్నారు. జంతువులు , పక్షుల విసర్జకాలను ఎప్పటికప్పుడు శుబ్రం చేస్తున్నారు. అంతే కాకుండా కేంద్ర అటవీ పర్యావరణ శాఖ హెచ్చరికలతో జంతువులకు ఆహారంగా ఇస్తున్న కోడిమాసంను గురువారం నుంచి నిలిపివేశారు. పెద్ద జంతువులకు , ఇతర పక్షులకు ఆహారంగా మటన్ ముక్కలనే అందచేస్తున్నారు. కోళ్లు ,బాతులు , కాకులు , కొంగలు తదితర పక్షులు అధికంగా సంచరించే ప్రాంతాలపై ప్రత్యేక నిఘా బృందాల ద్వారా పరిశీలన చేయిస్తున్నారు. ఎక్కడైనా బర్డ్‌ఫ్లూ అనుమానిత లక్షణాలతో పక్షులు కనిపిస్తే వెంటనే వాటిని నిశితంగా పరిశీలిస్తున్నారు. వాటి విసర్జకాలను సేకరించి పరీక్షలకు పంపుతున్నారు. చెట్ల కింద రాలిపడి చనిపోయిన పక్షులనుంచి కూడా శరీర భాగాలనుంచి శాంపిళ్లు సేకరించి ప్రయోగశాలకు పంపుతున్నట్టు అధికారులు వెల్లడించారు.

కోళ్లఫారాల వద్ద మరిన్ని జాగ్రత్తలు

బర్డ్ ఫ్లూ భయంతో కోళ్లఫారాల వద్ద వాటి నిర్వాహకులు మరిన్ని ముందస్తు జాగ్రత్తలు చేపట్టారు. పౌల్ట్రీ షెడ్లను రసాయనాల పిచికారితో శుబ్ర పరుస్తున్నారు. కోళ్లలో శరీర ఉష్ట్రోగ్రతలు పెరిగిపోవటం, కాలి పంజాలు వంకాయరంగులోకి మారటం, తల,కాళ్లు వాచిపోయి ఉండటం, ముక్కునుంచి, నోటి నుంచి ద్రవాలు స్రవిస్తుండం , నీరసపడిపోయి ఉండటం వంటి లక్షణాలను గమనిస్తున్నారు. అనుమానిత లక్షణాలు ఉన్న కోళ్లను వేరు చేసి మరింత లోతుగా గమినిస్తున్నట్టు కోళ్ల పరిశ్రమ నిర్వహాకులు చెబుతున్నారు.

పనివారికి పిపి కిట్లు

ఫౌల్ట్రీలో పనిచేస్తున్న కూలీలకు వ్యక్తిగత పరిశుభ్రత పట్ల జాగ్రత్తలు తీసుకునేలా చర్యలు చేపడుతున్నారు. చేతులకు తొడుగులు ధరింప చేస్తున్నారు. మాస్క్‌లు ,కళ్ల అద్దాలు ,ముఖం పూర్తిగా కవర్ చేసే విధంగా ట్రాన్సపరెంట్ షీట్ మాస్క్‌లు,పిపికిట్లు ధరించేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

చికెన్ ధరలు తగ్గుముఖం

బర్డ్‌ఫ్లూ భయంతో కోళ్ల పరిశ్రమ నిర్వహాకులు ముందు జాగ్రత్తగా తమ వద్ద ఉన్న కోళ్లను మార్కెట్‌కు తరలిస్తుండటంతో సరఫరా పెరిగి చికెన్ ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. ఒక్కరోజు వ్యవధిలోనే చికెన్ ధరల్లో కిలోకు పది రూపాయలు తగ్గినట్టు చికెన్ మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి.మరో వైపు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడా బర్డ్ ఫ్లూ ఉన్నట్టు సమాచారం లేదని ,కనీసం అటువంటి ఆనవాళ్లు కూడా లేవని అధికారులు చెబుతున్నారు. బర్డ్ ఫ్లూవల్ల భయాందోళనలు చెందాల్సిన అవసరం లేదంటున్నారు. కోడి మాంసాన్ని బాగా ఉడికించి తినాలని, గుడ్లను కూడా ఉడికించిన వాటినే తినాలని పచ్చిగుడ్లు తాగే అలవాటు ఉన్న వారు వెంటనే మానుకోవాని సూచిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News