Wednesday, November 27, 2024

విశ్వభారతి వర్సిటీ ప్రొఫెసర్ సస్పెన్షన్

- Advertisement -
- Advertisement -

Visva-Bharati Suspends Professor Sudipto Bhattacharya

కోల్‌కత: తన సహచర ఉద్యోగి నియామకంలో అవకతవకలు జరిగాయని ఆరోపించడమే కాక ఈ విషయాన్ని రాష్ట్రపతి, ప్రధాన మంత్రికి రాసినందుకు విశ్వ భారతి విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ ఒకరిని వర్సిటీ అధికారులు సస్పెండ్ చేశారు. ఈ ఆరోపణలలో తన సహచర ఉద్యోగిని కించపరిచే వ్యాఖ్యలు కూడా ఆ ప్రొఫెసర్ రాశారని వర్సిటీ సస్పెన్షన్ నోటీసులో పేర్కొంది. గురువారం సాయంత్రం వర్సిటీకి చెందిన కార్యనిర్వాహక మండలి సమావేశంలో సస్పెన్షన్ నిర్ణయాన్ని తీసుకున్నారు. తన సహచరునిపై ఆరోపణలు చేసన ప్రొఫెసర్ సుదీప్త భట్టాచార్యపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కార్య నిర్వాహక మండలి నిర్ణయించినట్లు నోటీసులో తెలిపారు. విశ్వభారతి యూనివర్సిటీ ఫాకల్టీ అసోసియేషన్ అధ్యక్షుడు కూడా అయిన ప్రొఫెసర్ భట్టాచార్య ఓపెన్ ఎయిర్ స్కూల్ అధిపతిగా తన సహచర ఉద్యోగి నియామకంలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ ఒక వాట్సాప్ గ్రూపులో పోస్ట్ చేశారు. దీన్ని ఈ మెయిల్‌గా రాష్ట్రపతికి, ప్రధానికి పంపారు. కాగా, భట్టాచార్యపై ఆయన సహచర ఉద్యోగి వర్సిటీ అధికారులకు ఇదివరకే లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు.

Visva-Bharati Suspends Professor Sudipto Bhattacharya

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News