ఢిల్లీకి చేరుకున్న 256 మంది..!!
న్యూఢిల్లీ: పరిమిత సంఖ్య ప్రయాణికులతో యుకె, భారత్ మధ్య తిరిగి విమానాల రాకపోకలు మొదలయ్యాయి. శుక్రవారం 256మంది ప్రయాణికులతో వచ్చిన విమానం ఢిల్లీ విమానాశ్రయంలో ఉదయం 1030కి ల్యాండైంది. శనివారం 291మంది ప్రయాణికులతో మరో విమానం లండన్ నుంచి రానున్నది. ఆదివారం రెండు విమానాల్లో మొత్తం 481మంది ప్రయాణికులు ఢిల్లీకి రానున్నట్టు అధికారులు తెలిపారు. యుకె, భారత్ మధ్య ఈ నెల 8 నుంచి 23 వరకు పరిమిత సంఖ్యలో విమానాలను అనుమతిస్తామని విమానయానశాఖమంత్రి హర్‌దీప్‌సింగ్ ఇప్పటికే ప్రకటించారు. వారానికి మొత్తం 30.. అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు 15 చొప్పున విమానాలకు అనుమతిస్తున్నట్టు ఆయన తెలిపారు. యుకెలో కరోనా కొత్త స్ట్రెయిన్ నేపథ్యంలో డిసెంబర్ 23 నుంచి జనవరి 7వరకు విమానాల రాకపోకల్ని నిలిపివేసిన విషయం తెలిసిందే. యుకె నుంచి వచ్చే ప్రయాణికులకు 72 గంటల ముందు శాంపిల్ పరీక్షలో నెగెటివ్ వస్తేనే విమానంలోకి అనుమతిస్తారని, భారత్‌కు చేరుకున్న తర్వాత విమానాశ్రయంలోనే ఆర్‌టిపిసిఆర్ పరీక్ష నిర్వహించాలన్న నిబంధన విధించామని అధికారులు తెలిపారు.
Air India Flight With 246 From UK Lands In Delhi