Friday, November 22, 2024

భారత క్రికెటర్లపై జాతి వివక్ష వ్యాఖ్యలు

- Advertisement -
- Advertisement -

Siraj and Bumrah Racial abuse by SCG Crowd

సిడ్నీ: ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టులో భారత క్రికెటర్లపై ఆతిథ్య జట్టు అభిమానులు అతిగా ప్రవర్తించారు. వరుసగా రెండు రోజుల ఆటలో కూడా టీమిండియా ఆటగాళ్లపై ఆసీస్ అభిమానులు జాత్యంహకర వ్యాఖ్యలు చేశారు. స్పీడ్‌స్టర్లు సిరాజ్, బుమ్రాలను లక్షంగా చేసుకుని కొంతమంది అభిమానులు దురుసుగా వ్యవహరించారు. ఈ విషయాన్ని భారత క్రికెట్ బోర్డు ఆస్ట్రేలియా క్రికెట్ పెద్దల దృష్టికి తీసుకెళ్లింది. బౌండరీల వద్ద ఫీల్డింగ్ చేస్తున్న భారత క్రికెటర్లను లక్షంగా చేసుకున్న ఆస్ట్రేలియా అభిమానులు జాతి వివక్ష వ్యాఖ్యలు చేశారు. ఈ అంశంపై క్రికెట్ ఆస్ట్రేలియా విచారణ చేపట్టింది. ఒకవేళ ఈ వ్యాఖ్యలు నిజమని తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని క్రికెట్ ఆస్ట్రేలియా చీఫ్ నిక్ హాక్లి హామీ ఇచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News