62 మందితో విమానం గల్లంతు
ఇండోనేషియా దీవులలో ఘటన
టేకాఫ్ 4 నిమిషాలకే ప్రమాదం
ద్వీపసముదాయ దేశంలో విషాదం
జకార్తా: ఇండోనేషియాలో 62 మందితో బయలుదేరిన విమానం ఒకటి అదృశ్యం అయింది. జకార్తా నుంచి పొంటియానక్‌కు టేంటియానక్ కు అయిన శ్రీవిజయ బోయింగ్ 737500 నెంబర్ విమానం నిమిషాల వ్యవధిలోనే గ్రౌండ్ కంట్రోల్‌తో సంబంధం లేకుండా పోయింది. ప్రయాణికులతో కూడిన విమానం ఆచూకీ గల్లం తు కావడం తీవ్ర కలకలం రేపింది. జకార్తా విమా నాశ్రయం నుంచి బయలుదేరిన నాలుగు నిమిషాల వ్యవధిలోనే ఇది ప్రమాదానికి గురి అయి ఉంటుందని అనుమానిస్తున్నారు. విమానం జాడ కనుగొనేందుకు వెంటనే ముమ్మర ప్రయత్నాలు చేపట్టారు. ఇండోనేషియా రవాణా మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి అదిత ఇరావతి సమాచారం అందిస్తూ ముందుగా రాడార్ సమాచారాన్ని విశ్లేషిస్తున్నారని తెలిపారు. ఎప్పటికప్పుడు విమాన అన్వేషణ కార్యక్రమాన్ని సంబంధిత ఉన్నతస్థాయి సంస్థలు పర్యవేక్షించుకుంటూ, సమన్వయంతో వ్యవహరి స్తున్నాయని వివరించారు. ఘటన గురించి సంబంధిత విమానయాన సంస్థ ఓ ప్రకటన వెలువరించింది. జకార్తా నుంచి పోంటాయానక్ కు వెళ్లేందుకు 90 నిమిషాల వ్యవధి పడుతుంది. విమానంలో 56 మంది ప్రయాణికులు, ఆరుగు రు సిబ్బంది మొత్తం కలిపి 62 మంది ఉన్నారు. ఇండోనేషియా అతిపెద్ద ద్వీపసముదాయక దేశం. ద్వీపాల మధ్య ప్రయాణాలకు విమానాలపై ఆధారపడుతుంటారు. ఇప్పుడు ఆచూకీ తెలియకుండా పోయిన విమానం నిర్జన ద్వీపంలో కూలిపోయి ఉంటుందని ఆందోళన చెందుతున్నారు. జాడ లే ని విమానం 27 ఏండ్ల కిందటిది అని నిర్థారణ అయింది.
ఈ విమానం స్వదేశీ విమానం అని వెల్లడైంది. శనివారం మధ్యాహ్నం థౌజెండ్ ఐలాం డ్స్‌లో లోహపు వస్తువులు సముద్ర జల్లాల్లో తేలియాడుతున్నట్లు స్థానిక జాలర్లు తెలియచేశారని వార్తాసంస్థలు తెలిపాయి. ఇవి విమాన శకలాల యి ఉంటాయని భావిస్తున్నారు. ఘటన గురించి తెలియగానే విమాన ప్రయాణికుల బంధువులు, సన్నిహితులు జకర్తా విమానాశ్రయానికి చేరుకున్నారు. తమ వారి క్షేమ సమాచారం కోసం ఎదురుచూస్తున్నారు. పలువురు రోదిస్తూ ఒకరిని ఒక రు ఓదార్చుకుంటూ, దైవ ప్రార్థనలు చేసుకుం టూ గడుపుతున్నారు. ఇండోనేషియాలో 2018లో బోయింగ్ విమాన దుర్ఘటనలో మొత్తం 189మంది ప్రయాణికులు మృతి చెందారు. జకార్తా విమానాశ్రయం నుంచి బయలుదేరిన కేవలం ఏడు నిమిషా ల వ్యవధిలోనే ఘటన జరిగింది. అంతకుముందు 1997లె సుమిత్రా ఐలాండ్‌లో మెడాన్ వద్ద గరు డా విమాన ప్రమాదంలో 234మంది దుర్మరణం చెందారు. 2014లో ఎయిర్ ఆసియా విమాన దుర్ఘటనలో 162మంది చనిపోయారు. సురబయా నుంచి సింగపూర్‌కు వెళ్లుతు న్న విమానానికి జరిగిన ప్రమాదం ఈ విషాదాన్ని మిగిల్చింది.
Indonesia Boeing plane crashes into Sea