సిడ్నీ: భారత్-ఆస్ట్రేలియాలో మధ్య జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్ లో జరిగిన జాత్యహంకార ఘటనలను ఐసిసి తీవ్రంగా ఖండించింది. జాతివివక్ష ఘటనలపై క్రికెట్ ఆస్ట్రేలియాను ఐసిసి వివరణ కోరింది. ఈ ఘటనలపై ఏం చర్యలు తీసుకున్నారో తెలపాలని ఐసిసి కోరింది. సిడ్నీ టెస్టుల్లో ప్రేక్షకులు భారత ఆటగాళ్ల పట్ల జాతివివక్ష వ్యాఖ్యలు చేశారు. మూడోరోజు ఆటలో బుమ్రా, సిరాజ్ పట్ల అసభ్యకరంగా మాట్లాడారు. నాలుగోరోజు ఆటలోనూ సిరాజ్ పట్ల మరోసారి ప్రేక్షకులు ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. దీంతో కెప్టెన్ రహానె, సిరాజ్ మ్యాచ్ అంపైర్లకు ఫిర్యాదు చేశారు. తక్షణమే చర్యలు తీసుకన్న పోలీసులు జాత్యంహకర వ్యాఖ్యలు చేసిన ఆరుగురిని బయటకు పంపించేశారు. జాత్యహంకార వ్యాఖ్యలపై టీమిండియాకు, ఆస్ట్రేలియా క్రికెట్ క్షమాపణలు చెప్పింది. దీనిపై రవిచంద్రన్ అశ్విన్ స్పందించాడు. గతంలోనూ జాతి వివక్షను ఎదుర్కొన్నామని తెలిపాడు. ప్రేక్షకులు పలుమార్లు అసభ్యంగా మాట్లాడారని అశ్విన్ పేర్కొన్నాడు. ప్రేక్షకుల తీరుపై క్రికెట్ ఆస్ట్రేలియాకు ఫిర్యాదు చేశామని చెప్పాడు. జాతివివక్షకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరాడు.
జాత్యహంకార ఘటనను ఖండించిన ఐసిసి
- Advertisement -
- Advertisement -
- Advertisement -