Friday, November 22, 2024

ధరణికి దిక్సూచి

- Advertisement -
- Advertisement -

తరగతులు ఎప్పటినుంచి?
ఫిట్‌మెంట్, సర్వీసు పరిగణనను 3 నుంచి 2ఏళ్లకు తగ్గించడం, ప్రత్యేక జోన్‌గా
హైదరాబాద్‌తో పాటు రాష్ట్రపతి ఉత్తర్వుల పరిధిలోకి తీసుకురావడం

కలెక్టర్లు, మంత్రులు, ఉన్నతాధికారులతో సిఎం కెసిఆర్ నేడు జరిపే భేటీలో చర్చించే అవకాశం

KCR Review Meeting on Controlled Farming 

మన తెలంగాణ/హైదరాబాద్: ఉద్యోగుల పదోన్నతులతో పాటు పలు శాఖల్లోని వివిధ అంశాలపై సిఎం కెసిఆర్ నేడు ఉదయం 11 గంటలకు ప్రగతిభవన్‌లో కలెక్టర్‌లు, మంత్రులు ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. రెవెన్యూ, పంచాయతీరాజ్, మున్సిపల్, విద్య, వైద్యారోగ్యం, అటవీ శాఖల్లో నెలకొన్న తదితర అంశాలపై ముఖ్యమంత్రి చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. వ్యవసాయ భూములకు సంబంధి ంచి ధరణి పోర్టల్‌లో నెలకొన్న పలు అంశాలపై ఎలా ముందుకెళ్లాలన్న దానిపై సిఎం అధికారులతో చర్చించనున్నారు. ఇప్పటికే ధరణి పోర్టల్‌లో(వ్యవసాయ భూములకు) సంబంధించి 37 అంశాల్లో తహసీల్దార్‌లు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వానికి వారు విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో వాటిపై మార్గదర్శకాలను ఎప్పుడు జారీ చేయాలి, ఎలా ముందుకెళ్లాలి ప్రజలకు ఎప్పటినుంచి అందుబాటులోకి తీసుకురావాలన్న దానిపై చర్చించాలని నిర్ణయించినట్టుగా తెలిసింది. వీటితో పాటు రాష్ట్రంలో కరోనా పరిస్థితులు, వైరస్ వ్యాప్తి నివారణకు తీసుకుంటున్న చర్యలు, కరోనా టీకాను అన్ని ప్రాంతాలకు సరఫరా చేయడం, ప్రాధాన్య క్రమంలో పౌరులకు వ్యాక్సిన్ వేయడానికి కార్యాచరణపై సిఎం కెసిఆర్ సమాలోచనలు జరపాలని నిర్ణయించినట్టుగా తెలిసింది. పల్లెప్రగతి, పట్టణ ప్రగతి నిధులు సకాలంలో అందుతున్నాయా, వాటి వినియోగం ఎలా ఉంది తదితర అంశాలపై కూడా చర్చించే అవకాశం ఉన్నట్టుగా సమాచారం.  తరగతులను ఎప్పటినుంచి తిరిగి ప్రారంభించాలి
రాష్ట్రంలోని విద్యాసంస్థల్లో తరగతులను ఎప్పటినుంచి తిరిగి ప్రారంభించాలి, క్లాసులను ఎప్పుడు నిర్వహించాలి, ఏ విధంగా నిర్వహించాలి, ఇతర రాష్ట్రాల్లో అనుసరిస్తున్న విధానాలు ఏమిటి తదితర అంశాలు కూడా ఈ సమవేశంలో చర్చకు వచ్చే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. వీటితో పాటు గ్రామాలు, పట్టణాల్లో పచ్చదనం పెంచడానికి తీసుకుంటున్న చర్యలు, భవిష్యత్‌లో చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించడంతో పాటు వీటిపై సమగ్ర సమాచారాన్ని కలెక్టర్లు తీసుకురావాలని ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో అన్ని జిల్లాల కలెక్టర్‌లతో పాటు ఆయా శాఖల ఉన్నతాధికారులు పూర్తిస్థాయి సమాచారంతో నేడు జరిగే సమావేశానికి అధికారులు హాజరుకానున్నారు.
ఫిట్‌మెంట్, మూడేళ్ల సర్వీసును రెండేళ్లకు తగ్గించడం…
ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఉద్యోగుల పదోన్నతులు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో ప్రస్తుతం అనుసరించాల్సిన అంశాలను ఈ సమావేశంలో ఇందులో చర్చించడంతో పాటు ఫిట్‌మెంట్, మూడేళ్ల సర్వీసును రెండేళ్లకు తగ్గించడం లాంటి వాటిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనున్నట్టుగా తెలిసింది. పదోన్నతులకు సంబంధించి కలెక్టర్ ఆధ్వర్యంలో జరిగే డిపిసిలు సమావేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్న దానిపై ప్రభుత్వం సూచించే అవకాశం ఉన్నట్టుగా తెలిసింది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వివిధ శాఖల్లో సీనియార్టిని జాబితాను ఆయా శాఖల ఉన్నతాధికారులు తయారుచేసి జిల్లా కలెక్టర్‌లకు, హెచ్‌ఓడిలకు అందించగా, ఇప్పటికే ఉద్యోగ సంఘాల నాయకులు పదోన్నతులతో పాటు పలు సమస్యలను సిఎంతో పాటు సిఎస్ దృష్టికి తీసుకెళ్లిన నేపథ్యంలో అన్ని సమస్యలకు ఈ సమావేశం పరిష్కారం చూపనుందని ఉద్యోగులు భావిస్తున్నారు.
త్రిసభ్య సభ్య కమిటీ భేటీలో పలు అంశాలపై చర్చ
ఎపిలో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగుల జాబితాను ఇప్పటికే సిఎం కెసిఆర్‌కు ఉద్యోగ సంఘాల నాయకులు అందచేయగా, ఇందులో నాలుగోతరగతి ఉద్యోగి నుంచి సూపరింటెండెంట్ స్థాయి వరకు తెలంగాణకు చెందిన ఉద్యోగులు వివిధ శాఖల్లో ఆంధ్రప్రదేశ్‌లో పనిచేస్తున్నారు. వీరిని కూడా రెండు, మూడు నెలల్లో తెలంగాణకు తీసుకువచ్చేలా ఎలా ముందుకెళ్లాలన్న దానిపై చర్చించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టుగా తెలిసింది. ఇప్పటికే పిఆర్‌సి నివేదికపై త్రిసభ్య కమిటీ (సిఎస్ సోమేష్‌కుమార్, ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి కె.రామకృష్ణారావు, నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్‌కుమార్‌లు) బిఆర్‌ఆర్‌కె భవన్‌లో సమావేశమై చర్చించారు. ఆ చర్చలో వచ్చిన పలు ప్రాతిపదనలను సిఎం కెసిఆర్‌తో చర్చించాలని సిఎస్ నిర్ణయించినట్టుగా తెలిసింది. సిఎం నిర్ణయం తరువాత పిఆర్సీతో పాటు పదవీ విరమణ వయస్సుపై ప్రభుత్వం ప్రకటన చేయాలని నిర్ణయించినట్టుగా తెలిసింది.
జిల్లా, జోనల్, రాష్ట్ర స్థాయి క్యాడర్ పోస్టులు..
మల్టీజోన్ పరిధిలో హైదరాబాద్‌ను సచివాలయం శాఖాధిపతులను చేర్చేలా ప్రభుత్వం కార్యాచరణ చేస్తున్నట్టుగా తెలిసింది. ప్రధానంగా ఫ్రీజోన్‌గా ఉన్న హైదరాబాద్‌ను ప్రత్యేక జోన్‌గా ప్రకటించడంతో పాటు ఉమ్మడి రాష్ట్రంలో తీవ్ర డిమాండ్ ఉండి స్థానికేతరులకు కీలకంగా మారిన హైదరాబాద్‌ను సైతం రాష్ట్రపతి ఉత్తర్వుల పరిధిలోకి తీసుకురావాలని ప్రభుత్వం పరిశీలిస్తున్నట్టుగా సమాచారం. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ వ్యవస్థను మరింత కట్టుదిట్టం చేసేలా జిల్లా, జోనల్, రాష్ట్ర స్థాయి క్యాడర్ పోస్టులను కొనసాగించాలని హై లెవల్ కమిటీ గతంలో నివేదిక రూపొందించిన నేపథ్యంలో దీనిపై కూడా చర్చించాలని సిఎం కెసిఆర్ నిర్ణయించినట్టుగా తెలిసింది.

CM KCR to chair Collectors Meeting on Monday

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News