- Advertisement -
న్యూఢిల్లీ: తూర్పు లడఖ్‌లో మూడు రోజుల క్రితం భారత సైన్యం చేతిలో బందీ అయిన ఒక చైనా సైనికుడిని సోమవారం చైనా అధికారులకు అప్పగించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. వాస్తవాధీన రేఖ(ఎల్‌ఎసి)ద్వారా భారత భూభాగంలోకి చొరబడిన చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పిఎల్‌ఎ) సైనికుడు ఒకరిని తూర్పు లడఖ్‌లోని పాంగాంగ్ సరస్సు వద్ద భారత సైన్యం గత శుక్రవారం అదుపులోకి తీసుకుంది. సోమవారం ఉదయం 10.10 గంటలకు తూర్పు లడఖ్‌లోని చుషుల్-మాయిడో సరిహద్దు పాయింట్ వద్ద చైనా సైనికుడిని ఆ దేశానికి తిరిగి అప్పగించినట్లు అధికార వర్గాలు తెలిపాయి.
Indian Army hands over Chinese Soldier
- Advertisement -