Monday, November 25, 2024

కలెక్టర్లతో సిఎస్ సోమేశ్ కుమార్ వీడియో కాన్ఫరెన్స్

- Advertisement -
- Advertisement -

CS Somesh Kumar video conference with collectors

హైదరాబాద్: కరోనా వ్యాక్సిన్ సన్నద్దతపై జిల్లాల కలెక్టర్లతో సిఎస్ సోమేశ్ కుమార్ మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. టీకా కేంద్రాల వద్ద అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు. మొదటిదశలో ప్రభుత్వ, ప్రైవేట్ వైద్యసిబ్బందికి వ్యాక్సిన్ ఇవ్వాలని ఆదేశించారు. ఎవరికైనా టీకా వికటిస్తే వెంటనే తగు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి వ్యాక్సినేషన్ కేంద్రానికి ప్రత్యేక అధికారిని నియమించాలన్న సిఎస్ కేంద్రాల వద్ద అదనంగా టీకాలు ఉంచాలని అదేశించారు. కోవిడ్ వ్యాక్సిన్ తీసుకునేవారంతా అధికారులకు అందుబాటులో ఉండాలని చెప్పారు. వ్యాక్సినేషన్ ప్రక్రియలో ప్రజాప్రతినిధులు భాగం కావాలని ఆయన పేర్కొన్నారు. అయితే ఇప్పటికే పుణే నుంచి నగరానికి కోవిషీల్డ్ వ్యాక్సిన్‌ కంటెయినర్లు చేరుకున్నాయి. శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి వ్యాక్సిన్‌ను కంటెయినర్లలో కోఠిలోని స్టోరుకు తరలించారు. ఈ నెల 16న తెలంగాణ ప్రభుత్వం కోవిడ్-19 వ్యాక్సిన్లు వేసేందుకు ఏర్పాట్లు చేస్తుంది.

CS Somesh Kumar video conference with collectors

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News