- Advertisement -
వాషింగ్టన్: సిఐఎ డైరెక్టర్‌గా సీనియర్ దౌత్యవేత్త విలియమ్ జె బర్న్‌ను నూతన అధ్యక్షుడు జోబైడెన్ నామినేట్ చేశారు. బర్న్‌కు దశాబ్దాలుగా దౌత్యశాఖలో పని చేసిన అసాధారణ అనుభవమున్నదని బైడెన్ అన్నారు. జాతీయ భద్రత కోసం వాస్తవాల ఆధారంగా పూర్తి సమగ్రతతో,వృత్తి నైపుణ్యతతో స్వతంత్రంగా బర్న్ పని చేయగలరని బైడెన్ అన్నారు. మాస్కో నుంచి సైబర్ దాడులు, చైనా లేదా ఉగ్రవాదుల నుంచి బెదిరింపులను దీటుగా ఎదిరించి అమెరికా ప్రజల భద్రతకు సిఐఎ భరోసా ఇచ్చేలా తన అనుభవాన్నీ, నైపుణ్యాన్నీ బర్న్ వినియోగించగలరని బైడెన్ అన్నారు. అమెరికా విదేశాంగశాఖలో 33 ఏళ్లపాటు పని చేసిన బర్న్ 2014లో రిటైర్ అయ్యారు. ప్రస్తుతం బర్న్ అంతర్జాతీయ వ్యవహారాల్లో మేధోమథన సంస్థయైన కార్నెజీ ఎండోమెంట్ ఫర్ ఇంటర్నేషనల్ పీస్‌కు అధ్యక్షుడిగా పని చేస్తున్నారు.
- Advertisement -