Friday, November 22, 2024

ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలకు కరోనా వ్యాక్సిన్

- Advertisement -
- Advertisement -

Corona vaccination in primary health centers

ప్రత్యేక వాహనాల ద్వారా తరలిస్తున్న సిబ్బంది
గ్రేటర్ నగరానికి లక్ష డోసులు సరఫరా
తొలి విడుతల్లో 30 వేల సిబ్బందికి పంపిణీ
రెండో దశ తీసుకునే వారి వివరాలు సేకరిస్తున్న అధికారులు

హైదరాబాద్: నగరానికి కరోనా టీకా రావడంతో జిల్లా వైద్యాధికారులు కోఠి డిఎం కార్యాలయం సమీపంలో ఉన్న కోల్డ్ స్టోరేజీల నుంచి గ్రేటర్ మూడు జిల్లాల పరిధిలో ఉన్న ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలను ప్రత్యేక వాహనాల్లో వ్యాక్సిన్‌ను తరలించారు. ఈనెల 16 నుంచి వ్యాక్సిన్ దేశమంతా ప్రారంబిస్తుండటంతో నగరంలో కూడా ఆరోగ్యకార్యకర్తలకు పంపిణీ చేసేందుకు సిద్దం చేశారు. గ్రేటర్‌లో లక్ష సిబ్బంది ఉండటంతో లక్ష డోసులు అందుబాటులో ఉంచేలా చర్యలు చేపడుతున్నారు. ఒక్కో డోసు పదిమందికి ఇవ్వవచ్చని, టీకా వయల్స్‌లో 5 మిల్లీలీటర్ల చొప్పన వ్యాక్సిన్ ఉంటుంది. ప్రతి లబ్దిదారుడికి 0.5 ఎంఎల్ డోసు ఇస్తామని, వయల్ ఓపెన్ చేసిన వెంటనే ఆరు గంటలోపే పదిమందికి ఇస్తామని, ఆలస్యమైతే టీకా పనిచేయదు. అది కూడా 2నుంచి 25డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేసినప్పడు మాత్రమే పనిచేస్తుందని వ్యాక్సిన్ ఇచ్చి అనంతరం 30 నిమిషాల పాటు వైద్యులు పర్యవేక్షణలో ఉంటారని చెబుతున్నారు. దేశంలో ఏర్పాటు చేసి హబ్‌లో హైదరాబాద్‌కు చెందిన హబ్ పెద్దదని, ఇక్కడ రోజుకు 100 మెగా టన్నుల టీకా కార్గో నిర్వహణకు అవసరమైన మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. గ్రేటర్ పరిధిలో 31 వ్యాక్సిన్ కేంద్రాలను ప్రధాని మోడీ వర్చువల్‌గా ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు.

అమన్‌నగర్ యుపిహెచ్‌సీ, జూబ్లీహిల్స్ అపోలో, చెస్ట్ ఆసుపత్రి, డాక్టర్ పాల్‌దాస్ యుపిహెచ్‌సీ, ఫెర్నాండ్‌జ్ ఫౌండేషన్ ,కిమ్స్, కింగ్‌కోఠి జిల్లా ఆసుపత్రి, నాంపల్లి ఏరియా ఆసుపత్రి, రెయిన్ పిల్లల దవాఖాన, తిలక్‌నగర్ పిహెచ్‌సీ, సోమాజీగూడ యశోద, మేడ్చల్‌లో అదిత్య, అంకుర, మల్లారెడ్డి, మ్యాట్రిక్స్, మెడిసిటి, ఓమిని, రెమెడీ, కుషాయిగూడ, మల్లాపూర్,ఉప్పల్ పీహెచ్‌సీలు, రంగారెడ్డి జిల్లాలో కాంటినెంటల్, కేర్, మెడికోవర్, ఎఐజీ, కొండాపూర్, వనస్దలిపురం ఏరియా ఆసుపత్రుల్లో వ్యాక్సిన్ కేంద్రాలు ప్రారంభిస్తున్నట్లు వివరించారు. ప్రతి కేంద్రంలో వ్యాక్సినేషన్ , వెయిటింగ్ గదులు ఉండేలా చేస్తున్నట్లు చెబుతున్నారు. రెండవ దశలో వేసే పోలీసు, మున్సిఫల్,హోంగార్డులకు సంబంధించిన వివరాలు దాదాపు సేకరించామని, మూడో దశలో తీసుకునే 50ఏళ్లదాటిన వారితో పాటు, దీర్ఘకాలిక జబ్బులతో బాధపడుతున్నవారి వివరాలు ఫిబ్రవరి నుంచి సేకరిస్తామని జిల్లా వైద్యాధికారులు పేర్కొంటున్నారు. మూడు వర్గాలకు చెందిన వారు కోవిడ్ సాప్ట్‌వేర్‌లో స్వంతగా పేరు నమోదు చేసుకోవాలని సూచిస్తున్నారు. వ్యాక్సిన్ అందుబాటులో వచ్చేవరకు గ్రేటర్ ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని కోవిడ్ నిబంధనలు పాటించి వైరస్ బారిన పడకుండా ఉండాలని సూచిస్తున్నారు.

Corona vaccination in primary health centers

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News