- Advertisement -
జకార్తా : ఇండోనేషియాలో భూకంపం మృతుల సంఖ్య పెరుగుతోంది. భూకంపం ధాటికి ఇప్పటివరకు 34మంది ప్రాణాలు కోల్పోయారని అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. 600 మందికిపైగా గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్టు అధికారులు వెల్లడించారు. శుక్రవారం తెల్లవారుజామున సులవేసి ద్వీపంలో భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 6.2గా నమోదైందని, అనేక భవనాలు ధ్వంసమైనట్టు ఇండోనేషియా విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. భూకంపం ధాటికి భవనాలు కుప్పకూలాయి. పూర్తిగా విద్యుత్, కమ్యూనికేషన్ వ్యవస్థ దెబ్బతిన్నట్టు అధికారులు తెలిపారు. భూకంప కేంద్రాన్ని మజేన్ నగరానికి ఈశాన్యంగా ఆరు కిలోమీటర్ల దూరంలో, భూమిలోపల పది కిలోమీటర్ల లోతులో గుర్తించారు.
34 People Killed in Earthquake At Indonesia
- Advertisement -