Monday, November 25, 2024

బాగ్‌అంబర్‌పేట్‌లో మహిళ అదృశ్యం

- Advertisement -
- Advertisement -

Woman Missing in Bagh Amberpet

హైదరాబాద్: కుటుంబ కలహాలతో జీవితంపై విరక్తి చెందిన ఓ మహిళ ఇంట్లో నుంచి వెళ్లిపోయిన సంఘటన నగరంలోని బాగ్ అంబర్ పేటలో మూడు రోజుల క్రితం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం….. నగరంలో బాగ్‌ అంబర్‌పేటలో ఉంటున్న నక్క ఉపేంద్రకు కుటుంబ సభ్యుల మధ్య గత మూడు రోజుల నుంచి గొడవలు జరుగుతున్నాయి. దీంతో బాధితురాలు ఇంట్లో నుంచి ఈ నెల 13వ తేదీన వెళ్లిపోయింది. అప్పట నుంచి కుటుంబ సభ్యులు వెతుకుతున్నా ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Woman Missing in Bagh Amberpet

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News