- Advertisement -
న్యూఢిల్లీ: అయోధ్యలో రామమందిర నిర్మాణానికి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ మొదటి విరాళం ఇచ్చారు. శుక్రవారం రామజన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్ట్ ప్రతినిధులకు రూ.5,00,100 చెక్‌ను రాష్ట్రపతి అందించారు. విరాళాల సేకరణను దేశ మొదటి పౌరుడి నుంచి ప్రారంభిస్తున్నామని విహెచ్‌పి వర్కింగ్ ప్రెసిడెంట్ అలోక్‌కుమార్ అన్నారు. ట్రస్ట్ సహాధ్యక్షుడు గోవింద్‌దేవ్ గిరి మహరాజ్‌తో కలిసి అలోక్‌కుమార్ రాష్ట్రపతి దగ్గరకు వెళ్లారు. వీరివెంట ఆర్‌ఎస్‌ఎస్ నేత కుల్‌భూషణ్ అహూజా ఉన్నారు. దేశవ్యాప్తంగా ఫిబ్రవరి 27 వరకు విరాళాల సేకరణ జరుగుతుందని ట్రస్ట్ ప్రతినిధులు తెలిపారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ రూ.లక్ష చెక్‌ను ట్రస్ట్‌కు అందించారు. తమ కుటుంబం తరఫున మందిర నిర్మాణానికి ఓ ఇటుకను పంపనున్నట్టు ఆయన తెలిపారు.
- Advertisement -